Skin Care: చలికాలంలో బాడీ లోషన్లు అక్కర్లేదు.. ఈ 5 నూనెల్లో ఏ ఒక్కటి వాడినా చర్మం మెరిసిపోతుంది!
ABN, Publish Date - Jan 17 , 2024 | 02:22 PM
చలికాలంలో చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచడంలో ఈ నూనెలు బాగా సహాయపడతాయి.
చలికాలం చింతల కాలం. ముఖ్యంగా చర్మానికి ఇది కష్టకాలం. పొడి చర్మం, సున్నితమైన చర్మం ఉన్నవారు చలికాలంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. చలి ప్రభావం నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి బాడీ లోషన్లు, మాయిశ్చరైజింగ్ క్రీములు ఎడాపెడా వాడేస్తుంటారు. కానీ ఇవి పూర్తీగా రసాయనాలతో నిండి ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా వాడితే చర్మం బాగైనట్టు ఉంటుంది కానీ సున్నితంగా మారిపోతుంది. వీటికి బదులు సహజమైన నూనెలు వాడితే చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాదు కాంతివంతంగా కూడా మారుతుంది. అవేంటో తెలుసుకుంటే..
జొజోబా ఆయిల్..
జోజోబా ఆయిల్ చాలా తేలికగా ఉంటుంది. దీన్ని చాలావిధాలుగా ఉపయోగించవచ్చు. జోజోబా గింజల నుండి తీసే ఈ నూనెలో విటమిన్-ఇ, విటమిన్-బి కాంప్లెక్స్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనె చర్మ రంధ్రాలను అడ్డుకోకుండా నేరుగా చర్మరంధ్రాలలోకి వెళ్లి చర్మాన్ని రిపేర్ చేస్తుంది. చర్మానికి పోషణ ఇస్తుంది. పొడి చర్మం, సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది సూపర్ ఆయిల్.
ఇది కూడా చదవండి: పిల్లల ఐక్యూ వీర లెవల్ లో ఉండాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!
అర్గాన్ నూనె..
అర్గాన్ నూనెను లిక్విడ్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. దీంట్లో కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. చర్మానికి తేమను అందించడం మాత్రమే కాకుండా యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. చర్మం పొడిబారడం, ఫ్లాకీనెస్‌ను ఎదుర్కోవడంలోనూ, చర్మం మీద గీతలు, గరుకుదనం తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
స్వీట్ ఆల్మండ్ ఆయిల్..
బాదం నూనెలో విటమిన్-ఎ, విటమిన్-ఇ, విటమిన్-డి ఉంటాయి. పొడి చర్మానికి ఈ నూనె మెరుగైన ఫలితాలు అందిస్తుంది. మాయిశ్చరైజర్ కు బదులుగా బాదం నూనెను వాడితే చర్మం మృదువుగా మారడమే కాదు కాంతివంతంగా మారుతుంది.
ఇది కూడా చదవండి: వాము గింజల నీటిని తాగితే.. కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!
కొబ్బరి నూనె..
కొబ్బరినూనె అందరికీ అందుబాటులో ఉంటుంది. శక్తివంతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల చర్మ సంబంధ సమస్యలు తగ్గిస్తుంది.
ఆలివ్ నూనె..
ఆలివ్ నూనె వంటలలోనే కాదు.. చర్మానికి బాగా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, విటమిన్-ఇ పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని మృదువుగా ఉంచడంతో పాటు చర్మ సమస్యలను కూడా నయం చేస్తుంది.
ఇది కూడా చదవండి: Stomach Acids: గ్యాస్ట్రిక్ యాసిడ్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారా? ఈ 8 ఆహారాలతో సమస్యకు చెక్ పెట్టచ్చు!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 17 , 2024 | 02:22 PM