ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health: ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఈ తెల్లని ఫుడ్స్ జోలికి మాత్రం వెళ్లొద్దు!

ABN, Publish Date - Nov 03 , 2024 | 11:30 AM

జీవితాంతం ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే మైదాతో చేసిన ఫుడ్స్ జోలికెళ్లొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఒకసారి ఆరోగ్యం చేజారితే తిరిగి పొదడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కాబట్టి, ఆరోగ్యం విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అయితే, నేటి హడావుడి జమానాలో అనేక మంది మార్కెట్‌లో దొరికే ఫాస్ట్ ఫుడ్స్ తిని సరిపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా మైదాతో చేసిన ఫుడ్స్ ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తెల్లగా ఉండే 7 పదార్థాలతో ఆరోగ్యం కచ్చితంగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.

Viral: పురుషుల్లో క్యాన్సర్! ఈ లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి!

మైదాతో చేసే వైట్ బ్రెడ్‌లో పీచు పదార్థం, పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇది తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తీవ్ర ఎగుడుదిగుడులకు లోనవుతాయి. ఫలితంగా ఇవి తిన్న కాసేపటికే మళ్లి ఆకలి మొదలువుతుంది. దీంతో, అతిగా తిని క్రమంగా బరువుపెరుగుతారు. చివరకు టైప్ - 2 డయాబెటిస్ బారినపడతారు.


తెల్లబియ్యంతో కూడా ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా బియ్యంలో పీచు పదార్థం తక్కువగా ఉండటంతో గ్లైసిమిక్ ఇండెక్స్ పెరుగుతుంది. బ్రౌన్ రైస్‌తో పోలిస్తే పోషకాలు కూడా తక్కువగానే ఉంటాయి. కాబట్టి, ఇవి తింతే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఊబకాయానికి కూడా దారి తీస్తుంది.

Health: బరువు తగ్గేందుకు నడకకు మించిన ఎక్సర్‌సైజు లేదు! ఎందుకంటే..

మైదాతో చేసే వైట్ పాస్తాలో కూడా పీచు పదార్థం తక్కువ. దీని రుచి బాగుండొచ్చేమో గానీ రోజూ తింటే మాత్రం కచ్చితంగా బరువు పెరుగుతారు. దీనికి బదులు గోధుమలతో చేసిన ఆహారాలు ఆరోగ్యకరం.

ఇక మనం సాధారణంగా తినే చక్కెరను కూడా బాగా రిఫైన్ చేస్తారు. అంటే ఇందులో కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. పోషకాలు ఏమీ ఉండవు. ఇది తింటే బరువుపెరుగుతారు. డయాబెటిస్‌తో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. చక్కెరకు బదులు తేనె లేదా పళ్ల ఆధారిన తీపి పదార్థాల వైపు మళ్లడం మంచిదని న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు.


బంగాళదుంప చిప్స్‌తో కూడా ఆరోగ్య సమస్యలు తప్పవు. వీటిని నూనెలో వేయిస్తారు కాబట్టి ఇవి అనారోగ్యకారకమని న్యూట్రిషనిస్టులు హెచ్చరిస్తున్నారు. చిప్స్‌లో కూడా కెలొరీలు మినహా ఎటువంటి పోషకాలు కూడా ఉండవు. దీంతో, ఇవి దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారి తీస్తాయి.

ఫుల్ క్రీమ్ పాలతో చేసిన డెయిరీ ఉత్పత్తులు కూడా అనారోగ్య కారకాలు. పైపెచ్చు వీటిల్లో ప్రిజర్వేటివ్స్, ఇతర చక్కెరలు కూడా ఉంటాయి. ఇవన్నీ చివరకు కొలెస్టెరాల్‌ను పెంచి గుండె సంబంధిత సమస్యలు కలగజేస్తాయి.

Read Latest and Health News

Updated Date - Nov 03 , 2024 | 11:30 AM