Speed Walk: వేగంగా నడిస్తే మధుమేహానికి చెక్ పెట్టొచ్చా? అసలు నిజాలు బయటపెట్టిన వైద్యులు..!
ABN, Publish Date - Jan 23 , 2024 | 05:14 PM
వేగంగా నడిస్తే మధుమేహానికి చెక్ పెట్టొచ్చా అంటే అవుననే అంటున్నారు వైద్యులు. దీనికి చెక్ పెట్టాలంటే ఎంత వేగంతో వాకింగ్ చేయాలంటే..
మధుమేహం అనేది దీర్ఘకాలం వేధించే సమస్య. ఒక్కసారి ఇది దాడి చేసిందంటే ఇక దీన్ని నియంత్రణలో పెట్టడం తప్ప తగ్గించడం అంటూ ఉండదు. విచిత్రం ఏమిటంటే ఈ సమస్య చాపకింద నీరులా శరీరాన్ని కబళిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు నిరంతరం మందులు, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతారు. రోజులో ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు, శారీరక శ్రమ ఎక్కువలేని వారు, ఇప్పటికే ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నవారు మధుమేహానికి బలి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే వేగంగా నడిస్తే మధుమేహం రాకుండా జాగ్రత్త పడవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
నడక అద్బుతమైన వ్యాయామం. దీనికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. అయితే నడక మధుమేహం మీద ప్రభావం చూపిస్తుందా అంటే అవునంటున్నారు వైద్యులు. వేగంగా నడవడం వల్ల మధుమేహం రాకుండా చూడచ్చు(speed Walk can prevent diabetes). గంటకు 4 లేదా 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే మధుమేహం ప్రమాదం తగ్గుతుందట. అంతే కాదు.. ప్రతి కిలోమీటరు వేగం పెంచే కొద్ది 9శాతం మధుమేహ ప్రమాదాన్ని అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఈ వేగం లెక్కలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: మీకూ ఈ లక్షణాలుంటే.. ఈ విటమిన్ల లోపం ఉన్నట్టే లెక్క!
గంటకు 3కిలోమీటర్ల వేగంతో నడవడంతో పోలిస్తే గంటకు 3నుండి 5 కిలోమీటర్లు నడవడం వల్ల టైప్-2 మధుమేహాన్ని 15శాతం తగ్గించవచ్చు.
గంటకు 5 నుండి 6 కిలోమీటర్ల వేగం నడవడం వల్ల టైప్-2 డయాబెటిస్ ప్రమాదం 24శాతం తక్కువగా ఉంటుంది.
గంటకు 6కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిస్తే 39శాతం టైప్-2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది.
ఈ నడక వేగం పురుషులకు నిమిషానికి 87 అడుగులు, మహిళలకు నిమిషానికి 100 అడుగులు సమానమని అంటున్నారు. మధుమేహం రాకూడదని అనుకునేవారు ఇలా వేగంగా నడుస్తుంటే శరీరం కూడా చాలా దృఢంగా మారుతుంది.
ఇది కూడా చదవండి: Eye Test: మీది డేగ చూపైతే మీకో సవాల్.. ఈ ఫోటోలో ఉన్న 8వ వ్యక్తిని కనిపెట్టండి చూద్దాం!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 23 , 2024 | 05:14 PM