Star Anise: వంటల్లో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
ABN, Publish Date - Feb 12 , 2024 | 03:03 PM
అనాసపువ్వును చాలా తక్కువ వంటల్లోనే వాడుతుంటారు. కానీ దీని లాభాలు తెలిస్తే షాకవుతారు.
బిర్యానీ, మాంసాహార వంటకాలలో తప్పనిసరిగా కొన్ని సుగంధ ద్రవ్యాలు వాడుతారు. వాటిలో చెక్క, లవంగం, బిర్యానీ ఆకు మొదలైనవాటితో పాటూ అనాసపువ్వు కూడా ఉంటుంది. అనాసపువ్వు చూడటానికి చక్రంలా ఉంటుంది. అందుకే దీన్ని చక్ర ఫూల్ అని కూడా అంటారు. వంటల్లో వాడే ఈ అనాసపువ్వు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..
జీర్ణాశయానికి..
అనాసపువ్వును ఖచ్చితంగా వంటలలో ఉపయోగించే మొట్టమొదటి కారణం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే. ఇది శోథ నిరోధక, కార్మినేటివ్ లక్షణాలను కలిగిన అనెథోల్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఈ లక్షణాలు జీర్ణక్రియను సులభతరం చేయడం, ఉబ్బరం తగ్గించడం, అజీర్ణం లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అనాస పువ్వును వంటల్లోనూ, టీలలోనూ చేర్చడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి.
ఇది కూడా చదవండి: ఈ 8 కొరియన్ డ్రింక్స్ ఎంత పవరంటే.. బరువును ఐస్ లా కరిగిస్తాయ్..!
రోగనిరోధక శక్తి..
అనాసపువ్వులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. తద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీన్ని రెగ్యులరా్ గా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలకు వ్యతిరేకంగా శరీరంలో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం చేయవచ్చు.
శ్వాసకోశ సమస్యలు..
సాంప్రదాయ చైనీస్ వైద్యంలో దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులను తగ్గించడాని అనాసపువ్వు శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. దీని ఎక్స్‌పెక్టరెంట్ గుణాలు శ్లేష్మాన్ని సడలించడంలో, రద్దీని తగ్గించడంలో సహాయపడతాయి, అనాసపువ్వుతో టీ తయారుచేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
యాంటీమైక్రోబయల్ ..
అనాసపువ్వులో బయోయాక్టివ్ సమ్మేళనాలకు కారణమైన శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలు, చర్మ వ్యాధులు తగ్గిస్తాయి.
హార్మోన్ల బ్యాలెన్స్..
సాంప్రదాయ ఔషధాల తయారీలో అనాసపువ్వును ఉపయోగిస్తారు. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్లు సమతుల్యంగా ఉండటంలో ఇది సహాయపడుతుంది. ఇది శరీరంలో ఈస్ట్రోజెన్ చర్యను అనుకరించే ఫైటోఈస్ట్రోజెన్లు, మొక్కల సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇవి నెలసరి సరిగా రాకపోవడం, నెలసరిలో ఇబ్బందులు మొదలైనవాటిని సక్రమంగా చేయడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: Highest Land Owner: భారతదేశంలో ప్రభుత్వం తర్వాత అత్యధిక భూములు ఎవరికి ఉన్నాయో తెలిస్తే షాకవుతారు..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్యవార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 12 , 2024 | 03:03 PM