ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bulgur: దొడ్డు రవ్వ ఇంత మేలు చేస్తుందా.. తెలిస్తే వదిలిపెట్టరు

ABN, Publish Date - Apr 22 , 2024 | 10:55 AM

ఆరోగ్యకరమైన ఆహారాల లిస్టులో టాప్ 5లో ఉండేది దొడ్డు రవ్వ(Bulgur). ఈ పేరు చెప్పగానే చాలా మంది ముఖం ఏదోలా పెడతారు. కానీ ఇది పోషకాల గని అని మీకు తెలుసా. దొడ్డు రవ్వ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యం.. సమాజంలో ఇది ప్రస్తుతం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. తినే ఆహారం కల్తీ అవుతుండటంతో నిత్యం ఆసుపత్రులకు పరుగులు తీసే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. కరోనా తరువాత ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికి శ్రద్ధ పెరిగిందనేది వాస్తవం.

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు చాలా జాగ్రత్తగా ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాల లిస్టులో టాప్ 5లో ఉండేది దొడ్డు రవ్వ(Bulgur). ఈ పేరు చెప్పగానే చాలా మంది ముఖం ఏదోలా పెడతారు. కానీ ఇది పోషకాల గని అని మీకు తెలుసా. దొడ్డు రవ్వ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

పుష్కలంగా పోషకాలు..

ఈ రవ్వలో పోషకాలు ఎక్కువ. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వీటితోపాటు ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్‌‌పాళ్లు పుష్కలంగా ఉంటాయి.

అదుపులో బరువు..

బరువు కంట్రోల్‌లో ఉండటానికి దొడ్డు రవ్వ ఉపయోగపడుతుంది. ఇందులో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఆకలిని అరికడుతుంది. అతిగా తినకుండా ఆపుతుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు నిరంతర శక్తిని అందిస్తాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి దొడ్డు రవ్వ చక్కటి ఎంపిక.


జీర్ణశక్తికి..

రవ్వ జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. పేగుల కదలికను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు ఉపయోగపడుతుంది.

ఎముకల ఆరోగ్యానికి..

దొడ్డు రవ్వలో భాస్వరం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండటంలో ఉపయోగపడతాయి. మెగ్నీషియం శరీరంలో కాల్షియం స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బోలు ఎముకల వ్యాధి, ఎముకల పగుళ్లను తగ్గించడంలో రవ్వ సాయపడుతుంది.

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు..

రవ్వలో విటమిన్లు E, B సహా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జీవిత కాలం పెంచుకోవడానికి దొడ్డు రవ్వ బెస్ట్ ఆప్షన్.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 22 , 2024 | 10:56 AM

Advertising
Advertising