Weekend Drinking: దంపతుల లివర్ చిత్రాలు షేర్ చేసిన డాక్టర్! విషయమేంటో తెలిసి జనాలు షాక్!
ABN, Publish Date - Dec 07 , 2024 | 11:23 AM
వారాంతాల్లో మద్యం తాగితే పెద్ద డేంజ్ ఏమీ ఉండదని కొందరు చెబుతారు. అయితే, ఈ అపోహలతో ఎలాంటి నష్టం జరుగుతుందో చెబుతూ ఓ డాక్టర్ షేర్ చేసిన చిత్రాలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మద్యంపానానికి సంబంధించి జనాల్లో అనేక అపోహలు ఉన్నాయి. అప్పుడప్పుడూ తాగితే ఏం కాదని కొందరు భావిస్తారు. వారాంతాల్లో మద్యం తాగితే పెద్ద డేంజర్ ఏమీ ఉండదని కొందరు చెబుతారు. అయితే, ఈ అపోహలతో ఎలాంటి నష్టం జరుగుతుందో చెబుతూ ఓ డాక్టర్ షేర్ చేసిన చిత్రాలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ‘ది లివర్ డాక్’గా పాప్యులర్ అయిన కేరళ వైద్యుడు డా. సిరియాక్ ఆబీ ఫిలిప్స్.. ఓ దంపతుల లివర్‌ల చిత్రాలు షేర్ చేశారు (Health).
వారాంతాల్లో మాత్రమే డ్రింక్ చేసే ఓ 32 ఏళ్ల వ్యక్తి లివర్ ఫొటోను డా. సిరియాక్ నెట్టింట పంచుకున్నాడు. ఆయన లివర్ చెడిపోవడంతో భార్యే లివర్ డోనర్‌గా మారింది. దీంతో, ఆమె లివర్ చిత్రాలను కూడా షేర్ చేశారు. భార్య లివర్ ఆరోగ్యంగా ముదురు గులాబీ రంగులో ఉంటే భర్త లివర్ మాత్రం నల్లగా మాడిపోయినట్టు చిత్రాల్లో కనిపించింది. ఈ చిత్రాలు జనాలను షేక్ చేస్తున్నాయి. కేవలం వారాంతాల్లో మద్యం సేవించే వ్యక్తి లివర్ ఇంతగా డామేజ్ అవుతుందా అని అందరూ షాకైపోతున్నారు.
Tea: టీని తాగడంతో పాటు ఇలాక్కూడా వాడొచ్చని తెలుసా?
ఈ చిత్రాలకు కుప్పలు తెప్పలుగా కామెంట్స్ వచ్చి పడ్డాయి. ఆ వ్యక్తి వారమంతా తాగుతూ కుటుంబానికి అబద్ధాలు చెప్పి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సమాధానమిచ్చిన డాక్టర్.. ‘‘మీరు అలాగే అనుకుంటూ ఉండండి. కొన్ని స్వానుభంతో తెలుసుకుంటే కానీ అర్థం కావు’’ అని అన్నారు.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే విటమిన్ డీ తీసుకోవడం ఆపేయాలి.
‘‘ఆల్కహాల్ విషం. ఒంట్లోని ఆల్కహాల్‌ను తొలగించేందుకు లివర్ అధికంగా శ్రమించాల్సి వస్తుంది. కేవలం వారాంతాల్లో తాగినా లివర్‌పై ఒత్తిడి పెరిగిపోతుంది. లివర్ పాడవుతున్న సంకేతాలు బయటకు తెలిసేసరికే జరగవలిసిన నష్టం జరిగిపోతుంది. ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, సిర్రోసిస్, చివరకు లివర్ ఫేయిల్ అవుతుంది. ఇతడి లివర్ ఒక్కరోజులో పాడవలేదు. అతడు మెల్లగా దాన్ని కొన్నేళ్ల పాటు నాశనం చేసుకున్నాడు. ఒక్క డ్రింకే కదా అనుకుంటూ ఈ స్థితికి వచ్చాడు’’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలారకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.
Updated Date - Dec 07 , 2024 | 11:28 AM