ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tea: టీని తాగడంతో పాటు ఇలాక్కూడా వాడొచ్చని తెలుసా?

ABN, Publish Date - Dec 06 , 2024 | 02:11 PM

భారతీయులకు టీ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీతో ఆరోగ్యానికి ఎంత మేలు కలుగుతుందో దాదాపు ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే, టీతో ఇతర అనేక ప్రయోజనాలు ఉన్నాయనే విషయంలో జనాల్లో అవగాహన తక్కువనే చెప్పాలి. మరి టీతో ఇతర ఉపయోగాలు ఏంటో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు టీ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీతో ఆరోగ్యానికి ఎంత మేలు కలుగుతుందో దాదాపు ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే, టీతో ఇతర అనేక ప్రయోజనాలు ఉన్నాయనే విషయంలో జనాల్లో అవగాహన తక్కువనే చెప్పాలి. మరి టీతో ఇతర ఉపయోగాలు ఏంటో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం (Health).

కళ్లు ఉబ్బినట్టుగా ఉంటే టీతో సత్వర పరిష్కారం లభిస్తుంది. ఇందుకోసం గ్రీన్ లేదా బ్లాక్ టీ బ్యాగులను ఫ్రిడ్జ్‌లో కాస్త చల్లబరిచాక కళ్లమీద పెట్టుకోవాలి. దీంతో, కళ్లు ఉబ్బటం, కళ్ల చుట్టూ నల్లని వలయాలు సులువుగా మాయమవుతాయి. టీలోని యాంటీఆక్సిడెంట్స్, టానిన్లు చర్మంలో రక్తప్రసరణ పెంచుతాయి, చర్మం బిగుసుకుని ముడతలు పోయేలా చేస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గించి కళ్లు రీఫ్రెష్ అయ్యేలా చేస్తాయి.

Coffee: కాఫీ తాగిన 20 నిమిషాలకు శరీరంలో జరిగేది ఇదే!


టీని అరోమా థెరపీకి కూడా వినియోగించుకోవచ్చు. లావెండర్, ఛామోమిల్, జాస్మిన్ టీలను డిఫ్యూజర్‌లో వేస్తే వచ్చే సువాసనలు ఒత్తిడి తగ్గిస్తాయి. మూడ్ చిటికలో మెరుగుపడేలా చేస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన ఉల్లాసమైన వాతావరణం ఏర్పడేలా చేస్తాయి

టీలో తేనె, పెరుగు కలిపి పేస్టులా చేసి ఫేస్‌ మాస్క్ కింద వినియోగించొచ్చు. టీలోని యాంటీఆక్సిడెంట్స్ కారణంగా చర్మం పునరుత్తేజితమవుతుంది. ముసలి తనం ఛాయలు, మొటిమలు వంటివన్నీ తగ్గిపోతాయి. రెగ్యులర్‌గా టీతో చేసిన ఫేస్‌ప్యాక్‌లు వాడితే చర్మం యవ్వన కళను తిరిగిసొంతం చేసుకుంటుంది

టీని చుండ్రుకు చికిత్సగా కూడా వాడొచ్చు. ఇందులోని యాంటీమైక్రోబియల్ గుణాల కారణంగా నెత్తిపై పొలుసులు, దురదలు తగ్గుతాయి.టీలోని యాంటీఆక్సిడెంట్స్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

Height: 18 ఏళ్లు దాటాక కూడా ఎత్తు పెరగొచ్చా? సైన్స్ ఏం చెబుతోందంటే..


టీతో కీటకాలు ఇంట్లోకి రాకుండా చేయచ్చు. ఇందులో పెపర్‌మింట్, సిట్రనెల్లా లేదా లావెండర్ టీని కిటికీలు, తలుపుల చుట్టూ జల్లితే చీమలు, దోమలు అస్సలు లోపలికి రావు. ఇందులోని ఘాటు వాసనల కారణంగా ఇంట్లోని ఆహరపదార్థాల వాసనలు కీటకాలు గుర్తుపట్టలేక లోపలికి రావు.

తలుపులు, బల్లలు, గాజు పాత్రలను కడిగేందుకు బ్లాక్ టీ అత్యంత ఉపయుక్తం. తలుపులు, బల్లలకు అంటుకుని ఉన్న దుమ్మూ ధూళిని టీలోని టానిన్స్‌ను సులువుగా ఊడివచ్చేలా చేస్తాయి

వేడి నీటిలో కాస్తంత టీ జత చేసి స్నానం చేస్తే చర్మం నునుపుగా మారుతుంది. ఒత్తిడి తగ్గి చర్మంలోని విషతుల్యాలు తొలగిపోతాయి. గ్రీన్ టీతో ఇలాంటి ప్రయోజనాలు అత్యధికం.

Latest and Health News

Updated Date - Dec 06 , 2024 | 02:16 PM