ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Walnuts: వాల్‌నట్స్‌ తింటున్నారా.. ఇక ఆ క్యాన్సర్ల నుంచి మీరు సేఫ్

ABN, Publish Date - Nov 13 , 2024 | 07:52 PM

ఇప్పటి నుంచైనా జంక్ ఫుడ్ కి చెక్ పెట్టి హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలనుకునే వారికి ఇదొ సూపర్ ఫుడ్. రోజూ వాల్ నట్స్ ను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే దీనిని అస్సలు వదిలిపెట్టరు.

walnuts

ఒకప్పుడు అంతగా ప్రాచుర్యంలో లేని వాల్ నట్స్ బాగా డబ్బులు ఉన్నవారు మాత్రమే తినేవారు. కానీ వీటి బెనిఫిట్స్ తెలిసాక విదేశాల్లో టాప్ 10 వ్యవసాయ వస్తువుల్లో వీటిని కూడా సాగు చేస్తున్నారు. వాల్‌నట్స్‌లో కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు పోషకాలు కలిగినవి.


గుండె ఆరోగ్యానికి..

వాల్‌నట్‌లు ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లం నుంచి ఏర్పడ్డవి. ఇది శరీరంలో వాపును తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. నిజానికి ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే గింజల్లో ఇదీ ఒక్కటి. ఇందులో ఉండే ప్రత్యేక గుణాలు గుండెజబ్బుల నుంచి రక్షిస్తాయి.

మీ మెదడు పదిలంగా ఉండాలంటే..

వాల్‌నట్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని వృద్ధాప్యంతో వచ్చే మానసిక క్షీణతను నెమ్మదించేలా చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి మీ మెమరీ పవర్ ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.


గట్ ఆరోగ్యం

మీ ప్రేగులు, ప్రేగులలోని బాక్టీరియా సూక్ష్మజీవులు కూడా మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో అవసరం. వాల్‌నట్‌లు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ లోనూ ఇదే వెల్లడైంది. ప్రతిరోజూ వాల్‌నట్లను తినే వారు ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను కలిగి ఉన్నారని స్టడీలు చెప్తున్నాయి.

క్యాన్సర్ నివారణ

మీ గట్‌లోని సూక్ష్మజీవులు వాల్‌నట్‌లలో ఉండే సమ్మేళనాలను తీసుకుంటాయి. యురోలిథిన్ సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ యురోలిథిన్‌లు కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. క్యాన్సర్ నివారణలో వాల్‌నట్‌ల పాత్రను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.


తక్కువ ఆకలి వేసేలా..

వాల్‌నట్స్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటిలో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. వాల్‌నట్స్‌లోని ఆరోగ్యకరమైన అన్‌శాచురేటెడ్ కొవ్వులు మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఒక ఔన్స్ వాల్‌నట్స్ లో 190 కేలరీలు ఉన్నప్పటికీ, కేవలం 145 మాత్రమే ఉపయోగపడతాయని ఒక అధ్యయనం కనుగొంది. వాల్‌నట్‌లు మీకు అవసరమైన ఐరన్, మెగ్నీషియంను కూడా అందిస్తాయి - మీ రోజువారీ అవసరాలలో ఇది 10-14% శాతం ఉంటుంది.

Vegetable Prices: షాకింగ్.. త్వరలో పెరగనున్న కూరగాయల ధరలు, కారణమిదేనా...


Updated Date - Nov 13 , 2024 | 07:52 PM