ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Weight Loss: బాగా లావున్నారా? ఇలా చేస్తే చాలు.. 10 నుండి 30 కిలోలైనా ఈజీగా తగ్గడం ఖాయం!

ABN, Publish Date - Jan 21 , 2024 | 11:36 AM

10 నుండి 30 కిలోల బరువైనా సరే.. ఈ టిప్స్ తో ఈజీగా తగ్గించుకోవచ్చు.

అధికబరువు ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య. అధిక బరువు కారణంగా అనారోగ్య సమస్యలే కాదు.. సమాజం నుండి కుటుంబ సభ్యుల వరకు చాలామంది జోక్ పేరుతోనే చాలా కామెంట్స్ చేస్తుంటారు. లావుగా ఉన్న అధికశాతం మంది తమ బరువు తగ్గించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఆరోగ్య కోణం కంటే తమను అందరూ బాడీ షేమింగ్ చేస్తున్నారనే కారణమే ఎక్కువ ఉండటం షాకింగ్ కు గురిచేస్తుంది. చాలా లావుగా ఉండి, దాదాపు 10 నుండి 30 కిలోల వరకు బరువైనా సరే ఈజీగా తగ్గాలంటే మాత్రం ఈ కింద చెప్పుకున్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

కీ పాయింట్ ఇదే..

లావుగా ఉన్న చాలామంది బరువు తగ్గడం గురంచే ఆలోచిస్తారు కానీ మొదట చెయ్యాల్సిన పని బరువు పెరగకుండా నియంత్రించుకోవడం. బరువు పెరగకుండా నియంత్రించుకోగలిగితే శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించడం సులువు అవుతుంది.

ఇది కూడా చదవండి: నెలరోజుల పాటూ మాంసాహారం తినడం మానేస్తే.. ఏం జరుగుతుందంటే..!


బరువు పెరగకూడదంటే..

బరువు పెరగకూడదంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత ఇష్టమున్నా సరే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అప్పుడప్పుడైనా తినచ్చు కదా.. తింటే ఏమవుతుంది లాంటి లాజిక్ లు మానేయాలి. జంక్ ఫుడ్ మానేస్తే శరీరంలోకి వెళ్లే అదనపు కేలరీలను బంద్ చేసినట్టే. జంక్ ఫుడ్ బదులు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఫైబర్, తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి.

జంక్ ఫుడ్ తరువాత మానేయాల్సింది శీతలపానీయాలు. కార్బోనేటెడ్ పానీయాలలో చక్కెర శాతం ఎక్కువ. యాసిడ్స్ కూడా ఎక్కువ. ఇవి పదే పదే తినాలనే కోరికను పెంచుతాయి. శరీరాన్ని చాలాసైలెంట్ గా బద్దకంగా మారుస్తాయి. కేలరీలు చాలా ఎక్కువ. వీటిని కూడా బంద్ చెయ్యాలి. వీటి బదులు కీరా, క్యారెట్, సొరకాయ, బూడిద గుమ్మడికాయ, పుచ్చకాయ వంటి జ్యూసులు తీసుకోవాలి. ఇవి బరువు తగ్గడానికి తోడ్పడతాయి.

ఎట్టి పరిస్థితులలోనూ బయటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అది కేలరీలు ఎక్కువ లేని ఆహారమైనా సరే.. బయట తినడం మానుకోవాలి. ఇంట్లోనే ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. ఈ కారణంగా బరువు తగ్గడం సులువు అవుతుంది.

ఆహారం విషయంలోనే కాదు.. బరువు తగ్గాలంటే జీవనశైలిని కూడా మార్చుకోవాలి. ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునేవరకు వీలైనంత వరకు ప్రణాళికలు మార్చుకుంటూ ఉండాలి. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది.

ఇది కూడా చదవండి: Vitamin-B12: అసలు విటమిన్-బి12 శరీరానికి ఎందుకు అవసరం? ఇది లోపిస్తే ఏం జరుగుతుందంటే..!



బరువు తగ్గడం ఇలా..

ప్రతిరోజూ సుమారు గంట సేపు కనీసం 8వేల నుండి 10 వేల అడుగులు నడవడం అలవాటు చేసుకుంటే బరువు తగ్గడంలో చాలా గొప్ప మార్పులు కనిపిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

శారీరక శ్రమ లేకపోతే బరువు తగ్గడం అసాధ్యం. శరీరానికి చెమటలు పట్టేలాగా వ్యాయామం, నడక, సైక్లింగ్ చేయాలి. స్విమ్మింగ్, ఏరోబిక్స్, డాన్స్ వంటివన్నీ బరువును తగ్గించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి చేసే వ్యాయామంలో ఫన్ ఉంటే దాన్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ దిశగా అడుగులు వెయ్యాలి.

ఇది కూడా చదవండి: RO Water: ఆరోగ్యానికి మంచిది కదా అని ఫిల్టర్ వాటరే తాగుతున్నారా? ఈ నిజాలు తెలిస్తే..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 21 , 2024 | 11:36 AM

Advertising
Advertising