Coffee: కాఫీ తాగిన 20 నిమిషాలకు శరీరంలో జరిగేది ఇదే!
ABN, Publish Date - Dec 05 , 2024 | 08:27 AM
నిపుణులు చెప్పేదాని ప్రకారం, కాఫీ తాగిన వెంటనే ఉల్లాసంగా అనిపిస్తుందట. అయితే, ఈ మార్పు కేవలం మానసికమైనదని, కాఫీకి అలవాటు పడటంతో ఈ భావన తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి కాఫీ రక్తంలో కలిశాక దాని ప్రభావం మొదలవుతుందట.
ఇంటర్నెట్ డెస్క్: కొందరికి ఉదయాన్నే కడుపులో కాఫీ పడనిదే మంచం దిగబుద్ధి కాదు. అంతలా కాఫీకి అలవాటు పడిపోయి ఉంటారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి కాఫీ ఇష్టమైన పానీయం. మనదేశంలో కాఫీని ఇష్టపడే వారు అధికసంఖ్యలోనే ఉన్నప్పటికీ బ్రిటన్‌లో ఈ సంస్కృతి అత్యధికమని పరిశీలకులు చెబుతున్నారు. అక్కడి ప్రజలు రోజులో సగటున 95 మిలియన్ కప్పులు తాగుతారట. కాఫీ తాగగానే కలిగే మానసిక ఉల్లాసం అటుంచితే దీనితో దీర్ఘకాలికంగా కొన్ని నష్టాలు ఉన్నాయని కూడా నిపుణులు చెబుతున్నారు. మరి కాఫీ తాగిన తరువాత శరీరంలో వచ్చే మార్పులేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Health).
నిపుణులు చెప్పేదాని ప్రకారం, కాఫీ తాగిన వెంటనే ఉల్లాసంగా అనిపిస్తుందట. అయితే, ఈ మార్పు కేవలం మానసికమైనదని, కాఫీకి అలవాటు పడటంతో ఈ భావన తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి కాఫీ రక్తంలో కలిశాక దాని ప్రభావం మొదలవుతుందట.
Height: 18 ఏళ్లు దాటాక కూడా ఎత్తు పెరగొచ్చా? సైన్స్ ఏం చెబుతోందంటే..
కాఫీ తాగిన 20 నిమిషాలకు ఎనర్జీ లెవెల్స్, మూడ్‌లో మార్పులు కనిపిస్తాయి. గుండె కొట్టుకునే వేగం పెరిగి ఏకాగ్రత, అలర్ట్‌నెస్ ఎక్కువవుతాయి. ముఖ్యంగా డల్‌లా అనిపిస్తున్న సమయాల్లో ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే అనేక మంది ఉదయాన్నే తక్షణ శక్తి కోసం కాఫీపై ఆధారపడతారని వైద్యులు చెబుతున్నారు.
ఇక గుండె కొట్టుకునే వేగం పెరిగిన కొన్ని నిమిషాలకే అడ్రనలిన్ రష్ మొదలువుతంది. అంటే.. అడ్రనలిన్ హార్మోన్ విడుదలవుతుంది. దీంతో, ఉత్సాహం, ఎనర్జీ లెవెల్స్, ఏకాగ్రత వంటివన్నీ పెరుగుతాయి. కాఫీ తాగిన గంటకు ఈ భావనలన్నీ గరిష్ఠస్థాయికి చేరుతాయి. అయితే, ఇది ఆయా వ్యక్తుల జీవక్రియల తీరు, జన్యుపరమైన అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఆనందం ఉత్సాహం ఉరకలెత్తుతుందని అంటున్నారు. ముఖ్యంగా కాఫీ అంటే ఇష్టపడే వారిలో ఈ భావన మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
కాఫీలో డైయూరెటిక్ గుణాలు కూడా ఉంటాయి. అంటే.. మూత్ర విసర్జన ఎక్కువవుతుంది. కాఫీ తాగిన 30 నిమిషాలకు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. బ్లాడర్, ప్రొస్టేట్ సమస్యలు ఉన్న వారిలో ఇది ఎక్కువ.
Thirst: ఎంత నీరు తాగుతున్నా దాహంగా ఉంటోందా? కారణాలు ఇవే!
కెఫీన్ ప్రభావం పేగులపై కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొలాన్ భాగాన్ని కెఫీన్ ప్రేరేపించి మలవిసర్జన జరిగేలా చేస్తుంది.
అయితే, కాఫీకి అలవాటుతో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు పొద్దున్న 8 గంటలకు కాఫీ తాగితే వచ్చే ఉత్సాహం, పెరిగే ఎనర్జీ లెవెల్స్ అన్నీ ఉదయం 11 గంటల కల్లా సద్దుకుంటాయి. మళ్లీ నిరుత్సాహం , నిస్సత్తువ ఆవరిస్తాయి. కాఫీకి అలవాటు పడ్డ మెదడు మరో కప్పు కాఫీ కావాలని కోరుకుంటుంది. ఇక మధ్యాహ్నాని కల్లా శరీరంపై కాఫీ ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. దీంతో, మరో కప్పు తాగే వరకూ మనసు ఊరుకోదు. ఫలితంగా కాఫీ తాగనిదే ఉత్సాహం ఉండదేమో అనే స్థితికి చేరుకుంటారు. చివరకు రోజులో పలుమార్లు కాఫీ తాగేందుకు అలవాటు పడిపోతారు.
ఇక కెఫీన్ ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తుల జీవక్రియల తీరుతెన్నులు, జ్యుపరమైన అంశాలు, వయసు, స్త్రీపురుష బేధాలు వంటివి వాటిపై ఇది ఆధారపడి ఉంటుంది. కొందరి జీవిక్రియల తీరుతెన్నుల కారణంగా కెఫీన్ త్వరగా శరీరం నుంచి తొలగిపోతుంది. మరికొందరిలో మాత్రం ఇది ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.
Updated Date - Dec 05 , 2024 | 08:40 AM