ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: రోజూ ఈ టైంలో 15 నిమిషాల పాటు ఎండలో నిలబడితే సమృద్ధిగా విటమిన్ డీ!

ABN, Publish Date - Oct 28 , 2024 | 10:13 AM

ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య కాలంలో ఎండలో నిలబడితే శరీరానికి సమృద్ధిగా విటమిన్ డీ లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో స్లీవ్‌లెస్ డ్రెస్, షార్ట్స్ ధరించి కేవలం 15 నిమిషాలు ఎండలో నిలబడితే చాలని అంటున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: శరీరానికి విటమిన్ డీ ఎంతో అవసరం. కాల్షియం గ్రహించేందుకు, ఎముకల దృఢత్వానికి విటమిన్ డీ అవసరం. ఇది కండరాలు, నాడుల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అయితే, ఇటీవల కాలంలో అనేక మంది ఇళ్లూ, ఆఫీసులకే పరిమితం అవుతుండటంతో విటమిన్ డీ లోపం తలెత్తుతోంది. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్నారు (Health).

Diabetes: పండుగల సమయంలో షుగర్ పెరగకూడదంటే డయాబెటిస్ ఉన్నవారు ఇలా చేయాలి..


విటమిన్ డీ లోపం ఉన్న వాళ్లను అనేక శారీరక సమస్యలు వేధిస్తాయి. నిత్యం నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు బాధ పెడతాయి. శారీరక శ్రమ లేని సందర్భాల్లో కూడా ఒళ్లంతా నొప్పులుగా, నీరసంగా అనిపిస్తోందంటే విటమిన్ డీ లోపం ఉన్నట్టు సందేహించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇక విటమిన్ డీ లోపం సుదీర్ఘకాలం పాటు కొనసాగితే అనేక సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారిలో ఒస్టియోపోరోసిస్ వ్యాధి తలెత్తుతుంది. ఎముకలు బోలుగా మారి త్వరగా విరిగిపోతాయి. ఎండ తగలని వారికి విటమిన్ డీ లోపం తలెత్తే అవకాశం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Black Tea: బ్లాక్ టీ.. ఇలా తాగితే ఒంట్లో కొవ్వు ఐస్ లా కరిగిపోద్ది..


ఎక్కువ సేపు ఇళ్లల్లో గడిపే వృద్ధులు, లేదా దీర్ఘకాలిక రోగాలతో ఇంటికే పరిమితమైన వారికి విటమిన్ డీ లోపం తలెత్తే అవకాశం అధికం. ఇక ముదురు మేని ఛాయ ఉన్న వారి శరీరంలో విటమిన్ డీ తక్కువగానే తయారవుతుందట. ఇలాంటి వారి చర్మంలో మెలనిన్ అనే పిగ్మెంట్ అధికంగా ఉండటంతో సూర్యరశ్మి తగిలినా కూడా ఆశించిన స్థాయిలో విటమిన్ డీ తయారు కాదట. ఇలాంటి వారు కచ్చితంగా నెలకోసారి విటమిన్ డీ సప్లిమెంట్లు తీసుకుంటే ఎముకల దృఢత్వానికి నిలుపుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఎండలో నిలబడితే విటమిన్ డీ లోపం చాలా వరకూ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య కాలం ఇందుకు సరైనదని అంటున్నారు. ఈ సమయంలో కేవలం 15 నిమిషాలు ఎండలో నిలబడితే శరీరానికి తగినంత విటమిన్ డీ లభిస్తుందట. అయితే, స్లీవ్ లెస్ డ్రెస్‌ షార్ట్స్ వేసుకుని నిలబడి మంచి ఫలితం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

Read Latest and Health News

Updated Date - Oct 28 , 2024 | 10:23 AM