Iran Israel conflict: ఇరాన్ చేతిలో ఇజ్రాయెల్ వాణిజ్య నౌక.. అందులో 17 మంది భారతీయులు
ABN, Publish Date - Apr 13 , 2024 | 08:35 PM
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నారు. ఇజ్రాయెల్‌పై ఇప్పటికే ఆగ్రహంతో రగులుతున్న ఇరాన్ తాజాగా హార్మూర్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎంఎన్‌సీ ఏరిస్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకోవడం తాజా ఉదిక్రతలకు దారి తీసింది. ఇందులో 17 మంది భారతీయులు ఉన్నట్టు అధికారిక వర్గాల సమాచారం.
న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇప్పటికే ఆగ్రహంతో రగులుతున్న ఇరాన్ తాజాగా హార్మూర్ జలసంధి (Starait of Hormuz) సమీపంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎంఎన్‌సీ ఏరిస్ (MSC Aries) అనే వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకుంది. ఇందులో 17 మంది భారతీయులు ఉన్నట్టు అధికారిక వర్గాల సమాచారం. వీరిని విడిపించేందుకు ఇరాన్‌తో భారత్ సంప్రదింపులు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇరాన్ కమాండోలు హెలికాప్టర్ సహాయంతో వాణిజ్య నౌకను వెంబడించి స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఇరాన్ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఆ నౌకను ఇరాన్ ప్రాదేశిక జలాల వైపు తరలిస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాన్ని తీవ్రతరం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది.
ప్రతీకార చర్య..
ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించగా వీరిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళానికి చెందిన సీనియర్ గార్డ్ జనరల్ కూడా ఉన్నారు. ఇది ఇజ్రాయెల్ పనేనంటూ ఇరాన్ రగిలిపోతుంది. కాగా, గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ దాడికి దిగి 6 నెలలవుతోంది. ఇది ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా నడుస్తున్న ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇరాన్‌కు మద్దతుగా నిలిచే హిజ్‌బుల్లా, యెమెన్‌కు చెందిన హౌతిలు ఈ పోరాటంలో పాల్గొన్నట్టు ఇజ్రాయెల్ కన్నెర్ర చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే యుద్ధం పశ్చిమాసియాకు విస్తరించే అవకాశం ఉందని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 13 , 2024 | 09:04 PM