Nobel Prize: వైద్యశాస్త్రంలో కృషి.. ఇద్దరికి నోబెల్ ప్రైజ్
ABN, Publish Date - Oct 07 , 2024 | 04:01 PM
వైద్యశాస్త్రంలో చేసిన విశేష కృషికిగాను విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఇరువురికి వరించింది.
ఇంటర్నెట్ డెస్క్: వైద్యశాస్త్రంలో చేసిన విశేష కృషికిగాను విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఇరువురికి వరించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్ ట్రాన్‌స్ర్కిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా పురస్కారం వారిని వరించింది. స్వీడన్ స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ బృందం నోబెల్ అవార్డులను ఇవాళ ప్రకటించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, జన్యు నియంత్రణలో పరిశోధనలకుగానూ శాస్త్రవేత్తలు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారని అవార్డు ప్రదాన సంస్థ సోమవారం తెలిపింది. వైద్యశాస్త్రంలో ఇప్పటివరకు నోబెల్ బహుమతిని 114 సార్లు ప్రకటించగా.. 227 మంది అందుకున్నారు. ఇందులో కేవలం 13 మంది మహిళలు ఉన్నారు. నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది.
మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య విభాగం, శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. అవార్డు గ్రహీతలకు 10 లక్షల డాలర్ల(11 లక్షల స్వీడిష్ క్రోనర్‌లు) నగదు అందుతుంది. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకుగాను హంగేరి అమెరికన్ కాటలిన్ కరికో, హంగేరియన్ శాస్త్రవేత్త డ్రూ వీస్‌మాన్‌లకు గత సంవత్సరం వైద్య శాస్త్రంలో బహుమతి లభించింది. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించారు. అనంతరం స్వీడిష్ డైనమైట్ ఆవిష్కర్త, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరుతో ప్రపంచంలో వివిధ రంగాల్లో సేవలందించినవారికి 1901 నుంచి నోబెల్ బహుమతులు అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
KTR: మూసీ ఆర్భాటం ఎవరి కోసం.. కేటీఆర్ సూటి ప్రశ్న
Viral: భారతీయులకే జాబ్స్ ఇస్తున్నారు.. కెనడా శ్వేతజాతీయురాలి సంచలన ఆరోపణ
Bathukamma: ఆరోరోజు అలిగిన బతుకమ్మ... ఎందుకు అలిగిందో తెలుసా
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 07 , 2024 | 04:01 PM