Ayodhya: ఖండాంతరాలు దాటిన అయోధ్య రాముడి కీర్తి.. అక్కడ బిల్‌బోర్డుల్లో ప్రదర్శన
ABN, Publish Date - Jan 13 , 2024 | 11:05 AM
అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠకు(Lord Rama) ముందే రాములవారి కీర్తి ఖండాంతరాలు దాటుతోంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో రోడ్డుపక్కన ఉండే బిల్ బోర్డు(Bill Boards)ల్లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రచార చిత్రాలను ప్రదర్శించారు.
వాషింగ్టన్: అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠకు(Lord Rama) ముందే రాములవారి కీర్తి ఖండాంతరాలు దాటుతోంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో రోడ్డుపక్కన ఉండే బిల్ బోర్డు(Bill Boards)ల్లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రచార చిత్రాలను ప్రదర్శించారు.
అమెరికాలోని హిందువులంతా కలిసి 10 రాష్ట్రాల్లో 40 కంటే ఎక్కువ బిల్ బోర్డుల్లో అయోధ్య(Ayodhya) విశేషాలను చాటి చెబుతూ డిజిటల్ డిస్ ప్లే పై ప్రదర్శించారు. టెక్సాస్, ఇల్లినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీ, జార్జియాలో బిల్ బోర్డుల సంఖ్య ఎక్కువగా ఉంది. జనవరి 15న కొత్తగా అరిజోనా, మిస్సౌరీ రాష్ట్రాల్లో ప్రదర్శించనున్నారు.
అమెరికా విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి అమితాబ్ మాట్లాడుతూ.. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అమెరికాలో నివసిస్తున్న హిందువులంతా వెళ్లేలా ప్రోత్సహించడం ఈ బిల్ బోర్డుల ముఖ్య ఉద్దేశమని.. దానికి తోడు రాముడి ప్రాముఖ్యతను విదేశాల్లో చాటి చెప్పేందుకు బిల్ బోర్డులో ప్రదర్శించామని తెలిపారు.
జనవరి 22న పెద్ద ఆలయ గర్భగుడిలో శ్రీరామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి 7 వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. అయోధ్య నగరి సర్వాంగ సుందరంగ ముస్తాబు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"
Updated Date - Jan 13 , 2024 | 11:08 AM