ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lebanon Israel: లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌లోకి దూసుకొచ్చిన రాకెట్లు.. టెన్షన్ టెన్షన్

ABN, Publish Date - Nov 01 , 2024 | 01:25 PM

లెబనాన్‌లో హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు మొదలుపెట్టిన తర్వాత ఇజ్రాయెల్‌కు తొలిసారి భారీ షాక్ తగిలింది. లెబనాన్ నుంచి పలు రాకెట్లు ఇజ్రాయెల్ భూభూభాగంలోకి దూసుకెళ్లాయి. ఇజ్రాయెల్‌ ఉత్తర భాగంలో జరిగిన ఈ దాడి ఏడుగురు చనిపోయారు.

లెబనాన్‌లో హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు మొదలుపెట్టిన తర్వాత ఇజ్రాయెల్‌కు తొలిసారి భారీ షాక్ తగిలింది. లెబనాన్ నుంచి కొన్ని రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి దూసుకెళ్లాయి. ఇజ్రాయెల్‌ ఉత్తర భాగంలో జరిగిన ఈ దాడిలో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో నలుగురు విదేశీయులు, ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారని ఆ దేశ వైద్యాధికారులు వెల్లడించారు. గురువారం ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. లెబనాన్‌లో దాడులు మొదలుపెట్టాక జరిగిన అతిపెద్ద క్రాస్ బోర్డర్ దాడి ఇదేనని ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.


ఈ దాడికి ప్రతిస్పందనగా లెబనాన్ అంతటా వైమానిక దాడులను ఇజ్రాయెల్ మరింత ముమ్మరం చేసింది. హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఈ దాడులు జరుపుతోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 24 మరణాలు నమోదయ్యాయని లెబనాన్ ఆరోగ్య శాఖ పేర్కొంది. మరోవైపు లెబనాన్, గాజాలలో కాల్పుల విరమణల కోసం అమెరికా దౌత్యవేత్తలు కృషి చేస్తున్నారు. నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందే ఈ ఘర్షణ తీవ్రతను తగ్గించాలని అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం భావిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పదవి నుంచి దిగిపోవడానికి ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉండడంతో ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.


కాగా లెబనాన్ గడ్డ మీద నుంచి జరిపిన దాడిపై ఇజ్రాయెల్ సైన్యం కూడా స్పందించింది. లెబనాన్ నుంచి దాదాపు 25 రాకెట్ల తమ భూభాగంలోకి వచ్చాయని పేర్కొంది. కాగా ఈ దాడులకు బాధ్యత వహిస్తూ హిజ్బుల్లా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా హమాస్‌ను తుదముట్టించేందుకు గాజాలో భీకర దాడులను ఇజ్రాయెల్ సేనలు ప్రారంభించాయి. కాగా హమాస్‌కు మద్దతు తెలుపుతున్న లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. గత నెలలో దాడులు పెట్టింది. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాతో పాటు పలువురు టాప్ కమాండర్లను అంతమొందించింది.

Updated Date - Nov 01 , 2024 | 01:29 PM