Emily Willis: అడల్ట్ ఫిల్మ్ స్టార్ ఎమిలీ పరిస్థితి విషమం.. చేతులెత్తేసిన వైద్యులు.. అసలేమైంది?
ABN, Publish Date - Mar 11 , 2024 | 05:41 PM
ఈమధ్య కాలంలో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పరిశ్రమకు చెందిన కథానాయికలు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారు. రీసెంట్‌గానే సోఫియా లియోన్ (Sophia Leone) (26) అనే అడల్ట్ ఫిల్మ్ స్టార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతికి గల కారణాలేంటో ఇంతవరకూ తెలియరాలేదు. ఇప్పుడు తాజాగా ఎమిలీ విల్లీస్ (Emily Willis) అనే మాజీ అడల్ట్ స్టార్ కోమాలోకి వెళ్లింది.
ఈమధ్య కాలంలో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పరిశ్రమకు చెందిన కథానాయికలు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారు. రీసెంట్‌గానే సోఫియా లియోన్ (Sophia Leone) (26) అనే అడల్ట్ ఫిల్మ్ స్టార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతికి గల కారణాలేంటో ఇంతవరకూ తెలియరాలేదు. ఇప్పుడు తాజాగా ఎమిలీ విల్లీస్ (Emily Willis) అనే మాజీ అడల్ట్ స్టార్ కోమాలోకి వెళ్లింది. గత నెల ప్రారంభంలో గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆమె.. ఇప్పటికీ కోలుకోలేదు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంది. ఈ నేపథ్యంలోనే.. చేదువార్తకు సిద్ధంగా ఉండాలని ఆమె కుటుంబం అభిమానుల్ని హెచ్చరించింది.
తన కూతురి ఆరోగ్య పరిస్థితి గురించి తండ్రి మైకెల్ విల్లీస్ (Michael Willis) మాట్లాడుతూ.. తన 25 కుమార్తె గత నెలలో రిహాబిలిటేషన్‌లో (Rehabilitation) ఉన్నప్పుడు గుండెపోటుకు గురైందని, అప్పటి నుంచి కోలుకోలేదని తెలిపారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై శ్వాస తీసుకుంటోందని చెప్పారు. మాదకద్రవ్యాల ఓవర్‌డోస్ వల్లే ఎమిలీకి గుండెపోటు వచ్చిందన్న వార్తల్ని ఆయన తోసిపుచ్చారు. టాక్సికాలజీ (Toxicology) రిపోర్ట్ నెగెటివ్‌గా వచ్చిందని స్పష్టం చేశారు. రిహాబ్‌కి వెళ్లడానికి ముందు తన కూతురి ఆకలి బాగా తగ్గిపోయిందని, కేవలం 86 పౌండ్ల బరువు మాత్రమే ఉండేదన్నారు. తాను ఆరోగ్యంగా ఉండాలని ఎమిలీ నిశ్చయించుకుందని.. అందుకే ఆమె పునరావాసానికి వెళ్లిందని చెప్పారు.
మరోవైపు.. ఎమిలీ చికిత్సకు తగిన డబ్బు లేకపోవడంతో ఆమె సోదరుడు మైఖేల్ విరాళాల కోసం ‘గో ఫండ్ మీ’ (GoFundMe) పేజీని ప్రారంభించాడు. ఇదే సమయంలో.. తన సోదరి రెండేళ్ల క్రితమే అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రిటైర్ అయ్యిందని చెప్పాడు. ఇతర వినోద రంగాల్లో విజయం సాధించాలనే ఆకాంక్షను ఆమె కలిగి ఉందని తెలిపాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్టు.. మాదకద్రవ్యాల కారణంగా తన సోదరికి గుండెపోటుకి రాలేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆమెకు తగిన చికిత్స అందుతోందని అన్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎమిలీకి చికిత్సతో పాటు సహాయం అవసరమని నొక్కి చెప్పాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 11 , 2024 | 06:02 PM