ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Asif Ali Zardari: పాక్ 14వ అధ్యక్షుడిగా అసిఫ్ అలీ జర్దారీ ఎన్నిక

ABN, Publish Date - Mar 09 , 2024 | 08:00 PM

పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నేత అసిఫ్ అలీ జర్దారీ శనివారంనాడు ఎన్నికయ్యారు. పాక్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడం ఇది రెండోసారి.

ఇస్లామాబాద్: పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా (Pakistan President) పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) సీనియర్ నేత అసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) శనివారంనాడు ఎన్నికయ్యారు. పాక్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడం ఇది రెండోసారి. పీపీపీ, పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ (PML-N) సంకీర్ణ ప్రభుత్వం ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో నిలబడిన జర్దారీకి 255 ఓట్లు పోలయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతున్న సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ (SIC) అభ్యర్థి మహమ్మద్ ఖాన్ అచక్‌జయీకి 119 ఓట్లు వచ్చాయి.


దివంగత్ పాక్ ప్రధాని బెనజీర్ భుట్లో భర్త అయిన 68 ఏళ్ల జర్దారీ 2008 నుంచి 2013 వరకూ పాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. మరోసారి పాక్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడంతో డాక్టర్ అరిఫ్ అల్వి స్థానంలో ఆయన పగ్గాలు చేపట్టనున్నారు. అరిఫ్ అల్వి ఐదేళ్ల పదవీకాలం గత ఏడాదిలో ముగిసినప్పటికీ కొత్త ఎలక్ట్రోరల్ కాలేజీ ఏర్పాటు కాకపోవడంతో ఆయన పదవిలో కొనసాగుతూ వచ్చారు.

Updated Date - Mar 09 , 2024 | 08:00 PM

Advertising
Advertising