ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Barack Obama: ఇంటి పేరును వదిలేసిన ఒబామా పెద్ద కుమార్తె.. అసలేమైంది?

ABN, Publish Date - Feb 22 , 2024 | 09:08 AM

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కుమార్తె తన ఇంటి పేరును వదిలేసుకుంది. అయితే ఆమె అలా ఎందుకు చేసింది. ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2008 నుంచి 2016 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. తనకు మాలియా, సాషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే పెద్ద కుమార్తె మాలియా(malia) తండ్రి మాదిరిగా రాజకీయాల్లోకి కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ క్రమంలో దీ హార్ట్ షార్ట్ ఫిలిం చిత్రానికి 'మీట్ ది ఆర్టిస్ట్' వీడియోలో మలియా షార్ట్ ఫిల్మ్‌కు రచన, దర్శకత్వం వహించినట్లు తెలిపింది. ఆ షార్ట్ ఫిల్మ్ 2024 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఫెస్టివల్‌కు హాజరు కాలేదు.

కానీ అప్పుడే ఒబామా పెద్ద కుమార్తె పేరు మార్చుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రీమియర్ షో ప్రసారం తర్వాత నిర్వహించిన మీట్ దీ ఆర్టిస్ట్ వీడియోలో కూడా మాలియా ఒబామాకు బదులు మాలియా ఆన్ అని ఉంది. ఇది తెలిసిన పలువురు ఆశ్చర్యానికి లోనయ్యారు. 25 ఏళ్ల తర్వాత తన సొంత గుర్తింపును దక్కించుకునే ప్రయత్నంలో భాగంగానే తన ఇంటిపేరు 'ఒబామా'ని మాలియా వదులుకుందని పలువురు అంటున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Rakul Preet Singh: జాకీ భగ్నానీతో ఘనంగా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం


ఆ చిత్రాన్ని హాస్యనటుడు, నటుడు డోనాల్డ్ గ్లోవర్ గిల్గా సంస్థ నిర్మించింది. ఆమె గతంలో గ్లోవర్ అమెజాన్ ప్రైమ్ షో స్వార్మ్‌లో రచయితగా పనిచేసింది. డొనాల్డ్ గ్లోవర్ మాలియాను నియమించుకోవడం గురించి మాట్లాడాడు. అతను ఆమెను అద్భుతమైన ప్రతిభావంతులైన వ్యక్తిగా అభివర్ణించాడు. ఆమె కష్టపడి పని చేస్తోందని చెప్పారు.

అయితే తమ ఇంటిపేరును వదులుకున్న ఏకైక సెలబ్రిటీ కిడ్ మాలియా మాత్రమే కాదు. నటుడు నికోలస్ కేజ్ 'ది గాడ్ ఫాదర్' వంటి కల్ట్ చిత్రాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన కొప్పోలా కూడా తన ఇంటిపేరును మార్చుకున్నారు. దీంతోపాటు నటి ఏంజెలీనా జోలీ తండ్రి జోన్ వోయిట్, తల్లి మార్చెలిన్ బెర్ట్రాండ్ ఇంటిపేరులోని మధ్య పేరును ఎంచుకున్నారు. ఇలా అనేక మంది ప్రముఖులు వారి పేర్లు మార్చుకున్న జాబితాలో ఉండటం విశేషం.

Updated Date - Feb 22 , 2024 | 09:08 AM

Advertising
Advertising