ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Canada Plane: విమానంలో యువకుడు హల్‌చల్, ఆగిన ఫ్లైట్.. ఎందుకంటే..?

ABN, Publish Date - Jan 07 , 2024 | 03:23 PM

విమానం (Flight) ఆకాశంలో ఉండగా ఓ యువకుడు రచ్చ చేశాడు. కుటుంబ సభ్యునిపై దాడికి దిగాడు. దీంతో విమానం 3 గంటలు ఆలస్యమైంది.

ఇంటర్నేషనల్ న్యూస్: విమానం (Flight) ఆకాశంలో ఉండగా ఓ యువకుడు రచ్చ చేశాడు. కుటుంబ సభ్యునిపై దాడికి దిగాడు. దీంతో విమానం 3 గంటలు ఆలస్యమైంది. కెనడా విమానంలో ఈ ఘటన జరిగింది. గాయపడ్డ అతనికి వైద్య చికిత్స అందజేశారు. దాడి చేసిన యువకుడిని పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు. వాళ్లు ఇద్దరూ కుటుంబ సభ్యులేనని.. గొడవ ఎందుకు జరిగిందనే అంశంపై మాత్రం స్పష్టత రాలేదు.

ఎయిర్ కెనడాకు (Air Canada) చెందిన 137 విమానం టొరంటో నుంచి కాల్గరీకి బయల్దేరింది. స్థానిక కాలమానం ప్రకారం విమానం 12.20 గంటలకు విన్నిపెగ్‌ రాగా.. అక్కడ గ్రాండే ప్రైరీ చెందిన ఓ ప్రయాణికుడు (Passenger) గొడవ స్టార్ట్ చేశాడు. తన కుటుంబ సభ్యునిపై విచక్షణరహితంగా దాడికి తెగబడ్డాడు. ఆ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌నకు గురయ్యారు.

ప్రయాణికులు, విమాన సిబ్బంది అతడిని విడిపించారు. విమానాన్ని (Flight) విన్నిపెగ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గాయపడ్డ వ్యక్తికి చికిత్స అందజేశారు. చిన్న గాయాలు అయనట్టు తెలిసింది. దాడిచేసిన యువకుడిని (Youth) అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఇతరులు ఎవరు గాయపడలేదని పోలీసులు (Police) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గొడవ జరగడానికి గల కారణం తెలియలేదు. దీంతో విమానం గమ్యస్థానానికి చేరేందుకు 3 గంటల ఆలస్యమైంది.

Updated Date - Jan 07 , 2024 | 04:05 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising