ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

China Unemployment: చైనాలో పెరిగిన నిరుద్యోగం.. చెక్ పెట్టేందుకు వినూత్న పద్ధతి

ABN, Publish Date - Mar 07 , 2024 | 10:12 PM

గత కొన్ని సంవత్సరాల నుంచి చైనాలో (China) పరిస్థితులు ఏమంత బాగోలేవు. ఒకవైపు జననాల రేటు (Birth Rate) గణనీయంగా పడిపోవడంతో, దాన్ని పెంచేందుకు ఆ దేశం ఎన్నో తిప్పలు పడుతోంది. యువతలో పెళ్లిళ్లపై ఆసక్తి కలిగించేందుకు రకరకాల పథకాలను తెస్తుంది. మరోవైపు.. యువత ఏమో నిరుద్యోగ (Unemployment) సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఉన్నత చదువులు అభ్యసించినా.. ఉద్యోగాలు దొరక్క తలలు పట్టుకుంటున్నారు.

గత కొన్ని సంవత్సరాల నుంచి చైనాలో (China) పరిస్థితులు ఏమంత బాగోలేవు. ఒకవైపు జననాల రేటు (Birth Rate) గణనీయంగా పడిపోవడంతో, దాన్ని పెంచేందుకు ఆ దేశం ఎన్నో తిప్పలు పడుతోంది. యువతలో పెళ్లిళ్లపై ఆసక్తి కలిగించేందుకు రకరకాల పథకాలను తెస్తుంది. మరోవైపు.. యువత ఏమో నిరుద్యోగ (Unemployment) సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఉన్నత చదువులు అభ్యసించినా.. ఉద్యోగాలు దొరక్క తలలు పట్టుకుంటున్నారు. పోటీ వాతావరణం ఎక్కువగా పెరిగిపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే.. నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు ఒక వినూత్న పద్ధతిని పాటిస్తున్నారు. తల్లిదండ్రులే నిరుద్యోగులకు జీతాలిచ్చేలా ఓ విధానాన్ని తెచ్చారు.


మన భారతదేశంతో పోలిస్తే.. విదేశాల్లో లైఫ్‌స్టైల్ (Lifestyle) చాలా భిన్నంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. పిల్లలు సంపాదించే స్థాయికి ఎదిగిన తర్వాత.. వాళ్లు ప్రత్యేకంగా తమ జీవితాన్ని ప్రారంభిస్తారు. తల్లిదండ్రులపై ఆధారపడకుండా.. తోచిన ఉద్యోగం చేసుకుంటూ, ఒక సెపరేట్ ఇంట్లో ఉంటారు. ఒకవేళ ఉద్యోగం లేకపోయినా.. చిన్నాచితకా పనులు చేసుకుంటూ విడిగానే ఉంటారే తప్ప, తల్లిదండ్రులతో కలిసి ఉండరు. అయితే.. చైనాలో నిరుద్యోగ సమస్య పీక్ స్టేజ్‌కి చేరిపోవడంతో, నిరుద్యోగులంతా తమ తల్లిదండ్రులే వద్ద ఉంటూ జీతాలు తీసుకునేలా ఒక కొత్త ఉద్యోగానికి శ్రీకారం చుట్టారు. ‘‘ఫుల్ టైమ్ సన్/డాటర్’’ (Full Time Son/Daughter) పేరుతో తల్లిదండ్రుల వద్ద ఉంటూ.. వారి నుంచి జీతం అందుకుంటారు.

ఇంతకీ వీళ్లేం చేస్తారో తెలుసా? తల్లిదండ్రుల వద్ద పూర్తి సమయం గడుపుతారు. వారికి ఎలాంటి కష్టం రాకుండా బాగోగులు చూసుకుంటారు. అలాగే.. ఇంటి పనులన్నీ చేసి పెడతారు. అంటే.. పేరెంట్స్ కోసం వంట చేయడం, గిన్నెలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులు చేస్తారు. తల్లిదండ్రులు ఏం చెప్తే.. అది చేయడమే వాళ్ల పని. ఇలా చేసినందుకు గాను.. వాళ్లు నెలకు ఏకంగా రూ.70-90 వేల వరకు జీతం పేరెంట్స్ నుంచి తీసుకుంటారు. ఈ విషయాన్ని అక్కడి నేషనల్ మీడియా పేర్కొంది. ఎవరైతే ఉద్యోగం లేక సతమతమవుతున్నారో.. వాళ్లిలా ఉద్యోగులు చేసుకుంటూ పేరెంట్స్ నుంచి జీతం తీసుకుంటున్నారని ఆ మీడియా తెలిపింది. ఇదేం విడ్డూరమో ఏమో!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 10:12 PM

Advertising
Advertising