ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సరిహద్దు రోడ్ల ధ్వంసం

ABN, Publish Date - Oct 15 , 2024 | 03:30 AM

ఉత్తర కొరియా- దక్షిణ కొరియా దేశాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇరు దేశాలను అనుసంధానించే రోడ్లను ధ్వంసం చేసేందుకు ఉత్తర కొరియా సిద్ధమైంది.

  • దక్షిణ కొరియా దళాలు రావొద్దనే!

సియోల్‌, అక్టోబరు 14: ఉత్తర కొరియా- దక్షిణ కొరియా దేశాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇరు దేశాలను అనుసంధానించే రోడ్లను ధ్వంసం చేసేందుకు ఉత్తర కొరియా సిద్ధమైంది. యుద్ధం వేళ సియోల్‌ దళాలు తమ దేశంలోకి చొచ్చుకురాకుండా ఉత్తర కొరియా ఈ చర్యలు చేపట్టినట్లు భావిస్తున్నారు. దక్షిణ కొరియాతో అనుసంధానమయ్యే అన్ని రకాల రవాణా మార్గాలను ధ్వంసం చేస్తామని, సోమవారంలోపు ఆ పని పూర్తి చేస్తామని ఉత్తర కొరియా సైన్యం గత వారమే ప్రకటించింది.

ఆ పనిని పూర్తి చేసేందుకు కిమ్‌ దళాలు ఇప్పటికే సమాయాత్తమయినట్లు దక్షిణ కొరియా ఆర్మీ అధికార ప్రతినిధి సోమవారం ప్రకటించారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్‌వైపు దక్షిణ కొరియా డ్రోన్లను పంపడంపై కిమ్‌ సర్కారు గుర్రుగా ఉన్నారు. ఆ దేశ డ్రోన్లు ప్యాంగాంగ్‌వైపు మళ్లీ కనిపిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. శతఘ్ని దళం సహా ఇతర కీలక యూనిట్లను ఇప్పటికే సరిహద్దులోకి పంపినట్లు పేర్కొంది. కిమ్‌ సోదరి కూడా ఇప్పటికే హెచ్చరించారు.

Updated Date - Oct 15 , 2024 | 03:30 AM