ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

USA: పాప్ సూపర్ స్టార్‌పై ట్రంప్ విమర్శలు.. కారణమదేనా

ABN, Publish Date - Sep 11 , 2024 | 08:49 PM

అగ్రరాజ్యం అమెరికాలో(US Elections 2024) అధ్యక్ష ఎన్నికలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ తొలి డిబెట్‌లో హోరాహోరీగా తలబడ్డారు.

వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం అమెరికాలో(US Elections 2024) అధ్యక్ష ఎన్నికలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ తొలి డిబెట్‌లో హోరాహోరీగా తలబడ్డారు. ఓ వైపు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల మధ్య రాజకీయ పోరు రసవత్తరంగా సాగుతున్న వేళ.. అమెరికన్ (USA) పాప్ సూపర్ స్టార్ టేలర్ స్విఫ్ట్‌పై (Taylor Swift) ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రత్యర్థి కమలా హారిస్‌కు (Kamala Harris) తాను ఓటు వేస్తానని టేలర్ ఇటీవలే ప్రకటించారు. దీంతో ట్రంప్ ఆమెపై కోపం పెంచుకున్నారని తెలుస్తోంది. టేలర్ కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


"నేను టేలర్ ఫ్యాన్‌ను కాదు. మీరు నిజంగా బైడెన్‌కు మద్దతు పలకలేరు. కానీ ఆమె డెమోక్రట్లను సమర్థిస్తున్నట్లు అనిపిస్తోంది. త్వరలోనే ఆమె భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు" అంటూ అంటూ టేలర్‌పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష బరిలో నిలిచిన కమలా హారిస్‌కు మద్దతిస్తున్నట్లు టేలర్ ఇటీవలే ఓ పోస్ట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో కమలా, టిమ్ వాజ్‌కు ఓటేస్తానని చెప్పారు. వారు హక్కుల కోసం పోరాడతారని.. ఇందుకోసం సరైన నేతను ఎన్నుకోవడం ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. గందరగోళంతో కాకుండా ప్రశాంతంగా దేశం కోసం ఏదైనా సాధించవచ్చని నమ్ముతున్నానని.. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.


వాడీవేడీగా డిబెట్..

చర్చ ప్రారంభంలో వేదికపై కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ కరచాలనం చేసుకున్నారు. దీంతో అధ్యక్ష అభ్యర్థుల డిబేట్ వేదికపై కరచాలనం లేకుండా గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీగా వీరిద్దరూ ముగింపు పలికినట్టు అయింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వీరిద్దరు నాయకులు కలసుకోవడం కూడా ఇదే తొలిసారి. దీంతో వీరిద్దరూ పరిచయం చేసుకున్నట్టు అయ్యింది. తాను అమెరికా అధ్యక్ష పదవిని చేపడితే మధ్యతరగతి కుటుంబాలు, చిరు వ్యాపారులకు అండగా నిలుస్తానని, ఈ మేరకు తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని ఆమె చెప్పారు.


ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవన వ్యయం అంశాలపై మీ ఆలోచనలు ఏమిటని ప్రశ్నించగా ఆమె ఈ సమాధానం ఇచ్చారు. ఓటర్ల మనస్సులలో ఎక్కువగా ఉన్న సమస్య జీవల వ్యయాలేనని హారీస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన మధ్యతరగతి కుటుంబ నేపథ్యాన్ని ఆమె ప్రస్తావించారు. ఇక బిలియనీర్లు, పెద్ద కంపెనీలపై పన్నుల భారాల నుంచి ఉపశమనం కల్పిస్తానని కమల వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌పై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్రంప్ చేతులు ఎత్తేసిన ఆర్థిక వ్యవస్థను జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చక్కదిద్దారని, ఆర్థిక వ్యవస్థ విషయంలో డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాంటి ప్రణాళికలు లేవని ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ఇలా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు.

For Latest News and National News click here

Updated Date - Sep 11 , 2024 | 08:49 PM

Advertising
Advertising