ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: ట్రంప్‌పై కాల్పుల కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ప్లానింగ్ మామూలుగా లేదుగా!

ABN, Publish Date - Jul 15 , 2024 | 06:41 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల వ్యవహారంలో.. ఊహించని పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అసలు నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్..

Donald Trump

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) జరిగిన కాల్పుల వ్యవహారంలో.. ఊహించని పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అసలు నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ (Thomas Mathew Crooks) ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడనే కారణం ఇంకా వెలుగులోకి రాలేదు కానీ.. విస్తుగొలిపే ఇతర నిజాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. థామస్ తన కారులో కొన్ని పేలుడు పదార్థాలను ప్యాక్ చేశాడని, ఆ కారుతోనే ర్యాలీకి వచ్చాడని విచారణలో వెల్లడైంది. దీన్ని బట్టి చూస్తే.. అతడేదో పెద్ద మారణహోమం సృష్టించాలన్న ప్లానింగ్‌తో అక్కడికి వెళ్లినట్లు అర్థమవుతోంది.


అలాగే.. ట్రంప్‌పై కాల్పులు చేసిన తుపాకి థామస్‌కు ఎక్కడి నుంచి లభ్యమైందన్న కోణంలో విచారించగా, అది అతని తండ్రిదేనని తేలింది. ఇదే సమయంలో.. ఈ దాడి వెనుక థామస్ ఉద్దేశం ఏంటో తెలుసుకోవడం కోసం అతని సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించారు. పాఠశాల స్నేహితులతో పాటు ఇతర సన్నిహితులను సైతం ప్రశ్నిస్తున్నారు. అయినా అతని ఐడియాలజీ ఏంటో తెలియరాలేదు. అలాగే.. సోషల్ మీడియాలో ఎలాంటి బెదిరింపుల పోస్టులు కూడా దొరకలేదు. పబ్లిక్ కోర్టు రికార్డుల ప్రకారం.. థామస్‌కి ఎలాంటి నేర చరిత్ర లేదని కూడా స్పష్టమైంది. దీంతో.. ఈ దాడిలో ఇతర ప్రమేయం ఏమీ లేదని, థామస్ ఒక్కడే ఈ కాల్పులకు తెగబడ్డాడని ఎఫ్‌బీఐ పేర్కొంది.


ఈ వ్యవహారంపై పిట్స్‌బర్గ్‌లోని ఎఫ్‌బిఐ స్పెషల్ ఏజెంట్ ఇన్‌ఛార్జ్ కెవిన్ రోజెక్ మాట్లాడుతూ.. ఈ దాడిలో ఏఆర్ తరహా రైఫిల్‌ని ఉపయోగించాడని, అది స్వీయసంరక్షణ కోసం అతని తండ్రి కొనుగోలు చేశాడని తెలిపారు. అయితే.. తండ్రి అనుమతితో ఆ తుపాకిని తీసుకున్నాడా? లేదా? అనేది ఇంకా విచారిస్తున్నామని అన్నారు. ట్రంప్‌పై థామస్ దాడి చేయడానికి ముందే ఓ స్థానిక అధికారి అతడ్ని ఎదుర్కున్నాడని.. అయితే అతను తన రైఫిల్‌ని గురి పెట్టడంతో ఆ అధికారి వెనక్కు తగ్గి మెట్లు దిగిపోయాడని అన్నారు. ఆ తర్వాతే థామస్ ట్రంప్‌పై కాల్పులు జరిపాడని వివరించారు. అప్పుడే సీక్రెట్ సర్వీస్ స్నైపర్లు గమనించి, అతనిని కాల్చి చంపారని చెప్పుకొచ్చారు.

Read Latest International News and Telugu News

Updated Date - Jul 15 , 2024 | 06:41 PM

Advertising
Advertising
<