ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

US Election Counting: అమెరికా ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఇదే.. డెమొక్రాట్లకు బైడెన్ అభినందనలు

ABN, Publish Date - Nov 06 , 2024 | 08:47 AM

యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే మాజీ అధ్యక్షుడు, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కంటే డొనాల్డ్ ట్రంప్ చాలా ఆధిక్యంలో కనిపిస్తున్నారు.

US Election 2024

వాషింగ్టన్: యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కంటే ట్రంప్ చాలా ఆధిక్యంలో ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 9.12 గంటల సమయానికి ట్రంప్‌కు 177 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయని, కమలా హారిస్‌కు 99 ఎలక్టోరల్ ఓట్లు సాధించారని ‘అసోసియేటెడ్ ప్రెస్’ కథనం పేర్కొంది. ప్రస్తుతానికి 18 రాష్ట్రాల్లో ట్రంప్.. 9 రాష్ట్రాల్లో కమలా హారిస్ విజయాలు సాధించారు. వరుసగా మూడోసారి టెక్సాస్‌లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రాష్ట్రంలో ఆయన 40 ఎలక్టోరల్ ఓట్లు పొందారని స్థానిక మీడియా పేర్కొంది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి టెక్సాస్‌ను గెలుచుకున్నారు.


స్వింగ్ రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని తొలి నుంచి అంచనా వేస్తున్న స్వింగ్ రాష్ట్రాల్లో కమలా హారిస్‌కే ప్రస్తుతం ఆధిక్యం కనిపిస్తోంది. స్వింగ్ రాష్ట్రాలు ఏడు ఉండగా 2 రాష్ట్రాల్లో ట్రంప్, 3 రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ లీడ్‌లో ఉన్నారు. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిచిగాన్‌లలో హారిస్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక జార్జియా, నార్త్ కరోలినాలో ట్రంప్ దూసుకెళ్తున్నారు. నెవాడా, అరిజోనా రాష్ట్రాల్లో లీడ్ ఎవరిదనే ఇంకా క్లారిటీ రాలేదు. కాగా పెన్సిల్వేనియాలో 19, మిచిగాన్‌లో 10, జార్జియాలో 16, విస్కాన్సిన్‌లో 10, నార్త్ కరోలినాలో 16, నెవాడాలో 6, అరిజోనా 11 చొప్పున ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. కాగా అమెరికా అధ్యక్ష పీఠం మీద కూర్చోవడానికి 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు మ్యాజిక్ ఫిగర్‌గా ఉంది.


డెమొక్రాట్లకు అధ్యక్షుడు బైడెన్ అభినందనలు

అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాట్లకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అభినందనలు తెలిపారు. తన సొంత రాష్ట్రం డెలావేర్‌లో యూఎస్ సెనేట్ సీటును గెలుచుకున్న లిసా బ్లంట్ రోచెస్టర్‌కు, రాష్ట్ర గవర్నర్‌గా ఎన్నికైన మాట్ మేయర్‌లకు అభినందలు తెలిపారని అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ ప్రకటించింది. పదవి నుంచి దిగిపోనున్న విల్మింగ్టన్ మేయర్‌ జాన్ కార్నీని కూడా ఆయన మెచ్చుకున్నారు. ఇక న్యూజెర్సీ సెనేటర్‌గా ఎన్నికైన ఆండీ కిమ్, నార్త్ కరోలినా తదుపరి గవర్నర్ జోష్ స్టెయిన్‌లకు కూడా బైడెన్ అభినందనలు తెలిపారు.


ఇవి కూడా చదవండి

అమెరికా ఎన్నికల వేళ విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికాలో ఎన్నికల కౌంటింగ్ మొదలు.. లీడ్‌లో ఎవరు ఉన్నారంటే

ఐపీఎల్ వేలంలో పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదే

అమెరికా ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఇదే.. డెమొక్రాట్లకు బైడెన్ అభినందనలు

For more International News and Telugu News

Updated Date - Nov 06 , 2024 | 08:56 AM