ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Parrot Fever: బెంబేలెత్తిస్తున్న ‘పారెట్ ఫీవర్’.. ఐదుగురు మృతి.. దీని లక్షణాలేంటి?

ABN, Publish Date - Mar 07 , 2024 | 03:22 PM

కొవిడ్ (Covid-19) ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపే.. రకరకాల వైరల్‌లు, వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మానవాళిని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు యూరోపియన్ దేశాల్లో ‘పారెట్ ఫీవర్’ (Parrot Fever) విజృంభిస్తోంది. దీనిని సిటాకోసిస్ (Psittacosis) అని కూడా అంటారు. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా ఐదుగురు మృతి చెందగా.. కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి.

కొవిడ్ (Covid-19) ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపే.. రకరకాల వైరల్‌లు, వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మానవాళిని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు యూరోపియన్ దేశాల్లో ‘పారెట్ ఫీవర్’ (Parrot Fever) విజృంభిస్తోంది. దీనిని సిటాకోసిస్ (Psittacosis) అని కూడా అంటారు. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా ఐదుగురు మృతి చెందగా.. కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఈ వ్యాధి బారిన పడుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation - WHO) తెలిపింది. ఈ దేశాల్లో ఇది తీవ్ర ప్రభావం చూపుతుండటంతో.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని WHO హెచ్చరించింది.


ఇంతకీ ఈ సిటాకోసిస్ (పారెట్ ఫీవర్) ఏంటి?

ఆ పారెట్ ఫీవర్ అనేది ‘క్లామిడోఫిలా సిటాసి’ (Chlamydophila psittaci) అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా అడవి పక్షులు, పెంపుడు పక్షులు, కోళ్లలో కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పక్షులు ఆరోగ్యంగానే కనిపిస్తాయి కానీ.. అవి శ్వాస లేదా మలవిసర్జన చేసినప్పుడు ఈ బ్యాక్టీరియాని విడుదల చేస్తాయి. అలా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎవరైతే పక్షులతో అనుబంధం కలిగి ఉంటారో, వాళ్లు ఈ వ్యాధి బారిన పడతారని వెల్లడైంది. 2023 నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ వ్యాధి కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని.. 2024లో ఇది ఐదుగురిని బలి తీసుకుందని WHO వెల్లడించింది. అయితే.. ఈ పారెట్ ఫీవర్ ప్రభావం తక్కువగానే ఉందని, ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదని WHO పేర్కొంది.

సిటాకోసిస్ లక్షణాలు ఏంటి?

ఈ వ్యాధి బారిన పడిన రోగుల్లో జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, పొడి దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. WHO ప్రకారం.. ఈ బ్యాక్టీరియాకు గురైన వ్యక్తుల్లో 5 నుండి 14 రోజులలోపు లక్షణాలు బయటపడతాయి. అప్పుడు వెంటనే యాంటీబయాటిక్ చికిత్సను (Antibiotic Treatment) అందిస్తే.. ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చు. న్యుమోనియా (Pneumonia) వంటి సమస్యలను కూడా నివారించొచ్చు. ఈ వ్యాధి 100 మందికి సోకితే, ఒక్కరు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి.. ఈ వ్యాధి మరీ ప్రాణాంతకమైంది కాదని వైద్యులు చెప్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 03:22 PM

Advertising
Advertising