ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gaza - Israel: గాజాలో ఇజ్రాయెల్ మరో దాడి.. ఏకంగా 40 మంది మృత్యువాత

ABN, Publish Date - Sep 10 , 2024 | 09:10 AM

పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్నాయి. తాజాగా దక్షిణ పాలస్తీనాలో ఏర్పాటు చేసిన నిరాశ్రయ జోన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 40 మంది మృత్యువాతపడ్డారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ మంగళవారం ప్రకటించింది. గాజా ప్రధాన దక్షిణ నగరమైన ఖాన్ యునిస్‌లోని అల్ మవాసీపై ఇజ్రాయెల్ ఆర్మీ ఈ దాడి చేసింది.

Hamas

గాజా: పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్నాయి. తాజాగా దక్షిణ పాలస్తీనాలో ఏర్పాటు చేసిన నిరాశ్రయ జోన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 40 మంది మృత్యువాతపడ్డారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ మంగళవారం ప్రకటించింది. గాజా ప్రధాన దక్షిణ నగరమైన ఖాన్ యునిస్‌లోని అల్ మవాసీపై ఇజ్రాయెల్ ఆర్మీ ఈ దాడి చేసింది. గతంలో దీనిని సురక్షితమైన జోన్ అని, ఎలాంటి దాడులు జరగబోవని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అయినప్పటికీ దాడికి పాల్పడడం గమనార్హం. అయితే ఈ ప్రాంతంలో హమాస్ కేంద్రంపై దాడి చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతోంది. కాగా ఈ జోన్‌లో దాదాపు పదివేల మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు.


రాత్రిపూట దాడి జరిగిందని, 40 మంది చనిపోగా 60 మంది గాయపడ్డారని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని గాజా సివిల్ డిఫెన్స్ అధికారి మహ్మద్ అల్ ముఘైర్ మంగళవారం తెల్లవారుజామున ప్రకటించారు. ‘‘మవాసి, ఖాన్ యునిస్‌లో ఆశ్రయం పొందుతున్నవారి గుడారాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. దాడి తర్వాత15 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వారికి మా సిబ్బంది అన్వేసిస్తున్నారు’’ అని ముఘైర్ పేర్కొన్నారు. హమాస్ సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మహమూద్ బసల్ మాట్లాడుతూ.. శిబిరంలో ఆశ్రయం పొందుతున్న ప్రజలను దాడిపై హెచ్చరించలేదని అన్నారు. ఇజ్రాయెల్ చర్యల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అన్నారు. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 20 నుంచి 40 కంటే ఎక్కువ టెంట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, మూడు భారీ గుంతలు ఏర్పడ్డాయని చెప్పారు.


కాగా పాలస్తీనాలో దాడిని ఇజ్రాయెల్ నిర్ధారించింది. తమ విమానం ఖాన్ యునిస్‌లోని హ్యుమానిటేరియన్ ఏరియాలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టిందని ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘గాజాలో ఏర్పాటు చేసిన మానవత సహాయ కేంద్రాలు దుర్వినియోగానికి గురవుతున్నాయి. ఇజ్రాయెల్‌కు, ఐడీఎఫ్ దళాలకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. నిరాశ్రయ కేంద్రాలు క్రమపద్ధతిలో దుర్వినియోగానికి గురవుతున్నాయి’’ అని పేర్కొంది. అయితే నిరాశ్రయుల కేంద్రంలో ఉగ్రవాదులు ఉన్నారనేది పచ్చి అబద్దమని హమాస్ చెబుతోంది.

Updated Date - Sep 10 , 2024 | 09:10 AM

Advertising
Advertising