ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Prisoners Escape: రాజధానిలో పెరిగిన హింస.. జైలు నుంచి తప్పించుకున్న వందలాది ఖైదీలు

ABN, Publish Date - Mar 03 , 2024 | 01:32 PM

హైతీ(Haiti) రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్‌(Port au Prince)లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైతీ నేషనల్ పెనిటెన్షియరీ జైలు నుంచి వందలాది మంది ఖైదీలు తప్పించుకున్నారు.

హైతీ(Haiti) రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్‌(Port au Prince)లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైతీ నేషనల్ పెనిటెన్షియరీ జైలు నుంచి వందలాది మంది ఖైదీలు తప్పించుకున్నారు(prisoners escape). ఈ విషయాన్ని అక్కడి పోలీస్ యూనియన్‌(police union) సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో రాజధానిలో ఉన్న అనేక మంది అధికారులు కార్లు, ఆయుధాలతో వారిని కట్టడి చేసేందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఆ క్రమంలో వారిని విజయవంతంగా నియంత్రిస్తే 3,000 మంది రాజధాని నుంచి తప్పించుకోలేరని ప్రకటనలో యూనియన్ పేర్కొంది.

ఆ క్రమంలో దేశంలోని పోర్ట్ ఓ ప్రిన్స్‌ జైలుపై నేరగాళ్లు(Criminals) దాడులు(attacks) నిర్వహించారు. ఆ జైలు సామర్థ్యం 3,900 మంది కాగా ఇక్కడ 11 వేల మందికిపైగా ఉండటం విశేషం. ఈ దాడి ఘటన వెనుక బాజ్ 5 ముఠా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కెన్యాతో ఒప్పందం అమల్లోకి వస్తే ఆ దేశ దళాలు హైతీకి సాయం చేయనున్నాయి. ఈ అంశంపై ముఠా నేత జిమ్మీ చెరిజియర్ ప్రధాని హెన్రీని(ariel henry) పదవి నుంచి దిగిపోయేవిధంగా చేస్తామని అన్నారు. పోలీసులు, సైన్యమే ప్రధానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


అయితే ఏరియల్ హెన్రీ(ariel henry) అసమర్థతపై ప్రజల నిరాశ, తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఈ హింస మరింత తీవ్రమైంది. హెన్రీ గత నెలలో పదవీవిరమణ చేయడంలో విఫలమైన తర్వాత ఇది పెరిగిపోయింది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 7లోగా ఎన్నికలు నిర్వహించి అధికారాన్ని బదలాయించాలని కట్టుబడి ఉన్నారు. కానీ అది అమలు కాలేదు. అయితే హెన్రీ ఇటివల కెన్యా పర్యటనకు వెళ్లిన క్రమంలోనే ఈ నేరగాళ్ల ముఠాలు రెచ్చిపోయాయి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Israel Hamas War: గాజా శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ దాడుల్లో 11 మంది మృతి.. WHO స్పందన

Updated Date - Mar 03 , 2024 | 01:32 PM

Advertising
Advertising