హమాస్ చీఫ్ యాహ్యా హతం
ABN, Publish Date - Oct 18 , 2024 | 05:55 AM
ఉగ్ర సంస్థ హమాస్ అధిపతి యాహ్యా సిన్వర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. నిరుడు అక్టోబరు 7న తమ దేశంపై జరిపిన మారణకాండకు సూత్రధారిని మట్టుపెట్టినట్లు పేర్కొంది. సామూహిక హత్యాకాండకు మూల కారకుడిని గురువారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) తుదముట్టించిందని ఇజ్రాయెల్
అక్టోబరు 7 మారణకాండ సూత్రధారిని చంపేశాం
ప్రకటించిన ఇజ్రాయెల్.. ధ్రువీకరించని హమాస్
లెక్క సరిచేశాం.. యుద్ధం ముగియలేదు: నెతన్యాహు
జెరూసలెం, అక్టోబరు 17: ఉగ్ర సంస్థ హమాస్ అధిపతి యాహ్యా సిన్వర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. నిరుడు అక్టోబరు 7న తమ దేశంపై జరిపిన మారణకాండకు సూత్రధారిని మట్టుపెట్టినట్లు పేర్కొంది. సామూహిక హత్యాకాండకు మూల కారకుడిని గురువారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) తుదముట్టించిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తెలిపారు. తమ ప్రజలపై హోలోకాస్ట్ తర్వాత చరిత్రలో అతిపెద్ద మారణకాండకు పాల్పడిన వ్యక్తిని హతమార్చామని, మొత్తానికి లెక్క సరిచేశామని.. యుద్ధం మాత్రం ముగియలేదని పేర్కొన్నారు.
కీలకఘట్టం..
హమాస్ వద్దనున్న బందీలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇదో కీలక ఘట్టంగా చెప్పారు. కాగా, సిన్వర్ మృతిపై విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ఈ మేరకు పలు దేశాల విదేశాంగ మంత్రులకు సందేశం పంపారు. హమాస్, ఇరాన్ నియంత్రణ నుంచి గాజా విముక్తం అవుతుందని తెలిపారు. ఏడాది నుంచి సాగుతున్న వేట ముగిసిందని.. అక్టోబరు 16న రాత్రి తమ దక్షిణ కమాండ్ దళాలు సిన్వర్‌ను చంపేశాయని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. దీనిని గొప్ప సైనిక, నైతిక విజయంగా అభివర్ణించారు. ఇరాన్ నేతృత్వంలోని ఉగ్ర మూకపై స్వేచ్ఛా ప్రపంచం సాధించిన విజయంగా పేర్కొన్నారు.
ధృవీకరించని హమాస్
రఫాలో బుధవారం చేపట్టిన లక్షిత భూతల దాడుల్లో సిన్వర్, మరో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. జైల్లో ఉన్నప్పుడు సేకరించిన డీఎన్‌ఏ ద్వారా సిన్వర్ మృతిచెందినట్లు నిర్ధారించారు. సిన్వర్ మృతిని హమాస్ ధ్రువీకరించలేదు. శరణార్థి శిబిరంలో పుట్టిన సిన్వర్ 2017 నుంచి హమాస్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. గాజాలో సాధారణ ప్రజలు, బందీలను రక్షణగా వాడుకుంటూ దాడులను తప్పించుకుంటున్నాడు. సైనిక వ్యూహాల్లో కీలకంగా నిలిచే.. సిన్వర్ మృతి నిజమే అయితే హమాస్‌కు పెద్ద దెబ్బ. ఇరాన్‌లో జూన్ 2వ తేదీన హమాస్ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ హతమార్చింది. ఇప్పుడు సిన్వర్‌నూ చంపేసింది. దీంతో నాయకత్వ శూన్యత ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం
Updated Date - Oct 18 , 2024 | 09:10 AM