Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. బతికున్న ఆనవాళ్లు లేవన్న రిపోర్ట్స్
ABN, Publish Date - May 20 , 2024 | 09:35 AM
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అజర్‌బైజాన్ సరిహద్దుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. తాజాగా హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అజర్‌బైజాన్ సరిహద్దుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. తాజాగా హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని ‘ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ’ (IRCS) గుర్తించినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్‌ఏ వెల్లడించింది. ఈ ఘటన జరిగిన 12 గంటల తర్వాత హెలికాప్టర్ శకలాల్ని రెస్క్యూ టీమ్స్ కనిపెట్టాయి. అయితే అక్కడ ఎవరూ బతికి ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని అధికారులు పేర్కొన్నట్టు ఆ కథనం పేర్కొంది. హెలికాప్టర్‌లో ఉన్న వాళ్లు బతికుండే అవకాశం లేదని తెలిపింది. దీంతో.. ఇరాన్ అధ్యక్షుడు చనిపోయి ఉండొచ్చని సమాచారం.
చరిత్ర సృష్టించిన అభిషేక్.. కోహ్లీ ఆల్‌టైం రికార్డు ఔట్
అంతకుముందు.. రక్షణ అధికారులు డ్రోన్స్ పంపించి, హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని కనుగొన్నారు. వెంటనే అక్కడికి బలగాలను పంపించారు. ‘తావిల్’ అనే ప్రాంతంలో అధ్యక్షుడి హెలికాప్టర్ కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అటు.. టర్కీకి చెందిన ‘అకింజి’ అనే యూఏవీ (మానవ రహిత విమానం).. ఓ ప్రదేశంలో కాలుతున్నట్టు దృశ్యాలను గుర్తించింది. ఈ సమాచారాన్ని ‘ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) కమాండర్ ధృవీకరించారు కూడా! మరోవైపు.. తమ 46 దళాలను రంగంలోకి దింపామని ఐఆర్‌సీఎస్ ప్రకటించింది. హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి నాలుగు బృందాలు చేరాయని ఐఆర్‌సీఎస్ అధిపతి రజీహ్ అలిష్వాండి ఇప్పటికే వెల్లడించారు. కానీ.. ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర సవాళ్లు ఎదురైనట్లు తెలిపారు.
మోదీకి వ్యతిరేకంగా ఆ పని చేసిన టీచర్.. సీన్ కట్ చేస్తే చివరికి..
కాగా.. ఇబ్రహీం రైసీ ఓ ఆనకట్ట ప్రారంభానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో.. ఓ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయిందని, ఎవరూ బ్రతికి ఉండకపోవచ్చని స్థానిక మీడియా పేర్కొంటోంది. దీంతో.. ఇరాన్‌వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశారు.
Read Latest International News and Telugu News
Updated Date - May 20 , 2024 | 10:52 AM