ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా అధికార ప్రతినిధి మృతి
ABN, Publish Date - Nov 18 , 2024 | 04:36 AM
లెబనాన్ రాజధాని బీరుట్‌లోని రస్ అల్ నబాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హిజ్బుల్లా అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల చీఫ్ మొహహ్మద్ అఫిఫ్ మృతి చెందాడు.
నెతన్యాహు నివాసంపై ఫ్లాష్ బాంబులతో దాడి
బీరుట్, టెల్ అవీవ్, నవంబరు17: లెబనాన్ రాజధాని బీరుట్‌లోని రస్ అల్ నబాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హిజ్బుల్లా అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల చీఫ్ మొహహ్మద్ అఫిఫ్ మృతి చెందాడు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇటీవల మృతిచెందిన హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాకు కూడా అఫిఫ్ మీడియా సలహాదారుగా, అల్ మనార్ టీవీ డైరెక్టర్ జనరల్‌గా కూడా వ్యవహరించాడు. అఫిప్ మృతితో హిజ్బుల్లాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. హిజ్బుల్లాపై మీడియాలో ప్రచురితమయ్యే కథనాలన్నీ అఫిఫ్ సమకూర్చేవే. మీడియా ద్వారా అంతర్జాతీయంగా హిజ్బుల్లాకు అనుకూలంగా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా అభిప్రాయాలను కూడగట్టడంలో అఫిఫ్ కీలకంగా వ్యవహరించాడు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసంపై ఫ్లాష్ బాంబులతో దాడి జరిగింది. సిజేరియాలోని ఆయన నివాసంపై దాడి జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు.
Updated Date - Nov 18 , 2024 | 04:36 AM