ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shocking Video: శ్మశానవాటికలో సొరంగం.. లోపల చూస్తే షాక్..

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:44 PM

శ్మశానవాటికలో సమాధులు ఉంటాయి. కానీ అక్కడ మాత్రం సీన్ వేరేలా ఉంది. శ్మశానవాటికలో సొరంగం ఏర్పాటు చేశారు. తీరా దాని దగ్గరకు వెళ్లి చూస్తే షాక్ అయ్యారు.

యుద్ధంలో నీతి, నియమాలు ఉండవు. గెలుపు దాహమే తప్ప.. ఎవరు బతికితే ఏంటి? చనిపోతే ఏంటి? అక్కడ మన, పర అనే తేడాలు ఉండవు. ఎవ్వరైనా ఒకటే. విజయం కోసం ఏం చేయడానికి సిద్ధమైపోతారు. అందుకోసం దేన్ని వాడుకోవడానికైనా సై అంటారు. అలాంటప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రత్యర్థిపై గెలుపు కోసం ఒకచోట ఏకంగా శ్మశానవాటికను తవ్వేశారు. సమాధుల కింద సొరంగం ఏర్పాటు చేశారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ల పనికి షాక్ అవ్వాల్సిందే. అసలు ఆ సొరంగంలో ఏం ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం..


సొరంగం నింపేశారు

ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. గాజా, లెబనాన్ మీద ఆదివారం భీకరంగా విరుచుకుపడింది ఇజ్రాయెల్ ఆర్మీ. ఈ వైమానిక దాడుల్లో 23 మంది మృతి చెందారు. దీన్ని కాస్త పక్కనబెడితే.. లెబనాన్‌లోని ఓ చోట శ్మశానవాటికను తవ్వి వాటి కింద సొరంగాలు ఏర్పాటు చేయడం, వాటిల్లో భారీగా ఆయుధాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. అండర్‌గ్రౌండ్ టన్నెల్స్‌లో బాంబులు ఉన్నాయని ఇజ్రాయెల్ మిలట్రీ తెలిపింది. వాటిని నిర్వీర్యం చేశామని పేర్కొంది. రాకెట్లను స్వాధీనం చేసుకున్నామని వివరించింది. ఆయుధాలతో సొరంగాన్ని నింపేశారని స్పష్టం చేసింది. శ్మశానవాటికకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వాళ్ల పనే

హిజ్జుల్లా గ్రూప్ శ్మశానవాటికను తవ్వి సొరంగాలు ఏర్పాటు చేసిందని.. వాటిల్లో ఆయుధాలను దాచి పెట్టిందని ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. శ్మశానంలో వెపన్స్ దాచిపెట్టడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, లెబనాల్‌లో దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ పేజర్ అటాక్స్‌కు తానే పర్మిషన్ ఇచ్చానని పేర్కొన్నారు. హిజ్బుల్లా టార్గెట్‌గా అపరేషన్‌కు తాను అంగీకారం తెలిపానని నెతన్యాహు అంగీకరించారు. ఇక, ఈ యుద్ధంతో శాంతి ఏర్పడే మాట పక్కనబెడితే.. ఇరు వైపులా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్న వారెందరో. ఇరు దేశాల్లోని లక్షలాది మంది ప్రజలు తమ ఆప్తుల్ని కోల్పోతున్నారు.


Also Read:

7 గంటల్లో భూప్రదక్షిణ!

హమాస్‌కు ఖతార్‌ షాక్‌

బంగ్లాదేశ్‌ సర్కారుకు మరిన్ని అధికారాలు!

For More International And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 01:09 PM