Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌ని ఇరకాటంలో పడేసిన ‘పెళ్లి’.. మరో ఏడేళ్లు జైలుశిక్ష
ABN, Publish Date - Feb 03 , 2024 | 08:32 PM
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే సైఫర్ కేసులో ఏడేళ్లు, తోషాఖానా అవినీతి కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష పడిన ఆయనకు తాజాగా మరో షాక్ తగిలింది. బుష్రా బీబీతో తాను చేసుకున్న ‘వివాహం’ అతనిని ఊహించని ఇరకాటంలో పడేసింది.
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే సైఫర్ కేసులో ఏడేళ్లు, తోషాఖానా అవినీతి కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష పడిన ఆయనకు తాజాగా మరో షాక్ తగిలింది. బుష్రా బీబీతో తాను చేసుకున్న ‘వివాహం’ అతనిని ఊహించని ఇరకాటంలో పడేసింది. మరో ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.5 లక్షల మేర జరిమానా విధించేలా చేసింది. ఎందుకంటే.. వారి నిఖా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని కోర్టు తేల్చింది. ఈ కేసులో ఒక్క ఇమ్రాన్‌కే కాదు.. బుష్రాకు కూడా కోర్టు సమాన శిక్ష విధించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బుష్రా బీబీ మొదటి భర్త అయిన ఖవార్ ఫరీద్ కొంతకాలం క్రితం ఒక కేసు పెట్టారు. తన మాజీ భార్య ఇస్లామిక్ నిబంధనలకు విరుద్ధంగా ఇమ్రాన్ ఖాన్‌ను వివాహమాడిందని ఆయన ఫిర్యాదు చేశారు. ఇస్లామిక్ నిబంధనల ప్రకారం.. భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవాలంటే కొంతకాలం విరామం తీసుకోవాలని.. కానీ ఈ నిబంధనల్ని బుష్రా ఉల్లంఘించిందని ఫరీద్ పేర్కొన్నాడు. అంతేకాదు.. పెళ్లి చేసుకోకముందే ఇమ్రాన్, బుష్రాల మధ్య వివాహేతర సంబంధం కొనసాగిందని కూడా ఆరోపణలు చేశాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఇమ్రాన్, బుష్రాలను దోషులుగా తేల్చింది. ఆ ఇద్దరికి ఏడేళ్లు జైలుశిక్షతో పాటు.. ఒక్కొక్కరికి రూ.5,00,000 చొప్పున జరిమానా విధించింది.
అయితే.. ఇమ్రాన్ ఖాన్ మాత్రం కోర్టు ఇచ్చిన తీర్పుని ఖండించారు. కోర్టు నుంచి బయటకొచ్చిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. తామేమీ ఇస్లాంకి విరుద్ధంగా పెళ్లి చేసుకోలేదని, తనతో పాటు తన భార్యని అవమానించేందుకు ఇలా చేశారని వాపోయారు. గతంలో తమపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా భార్యాభర్తలిద్దరూ వాటిని ఖండించారు. తాము పెళ్లికి ముందు వివాహేతర సంబంధం కూడా పెట్టుకోలేదని స్పష్టం చేశారు. కానీ.. కోర్టు మాత్రం ఇద్దరిని దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పడంతో పాకిస్తాన్‌లో సంచలనంగా మారింది.
Updated Date - Feb 03 , 2024 | 08:33 PM