Iran-Israel Conflict: 48 గంటల్లోగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి.. ఆ తర్వాత యుద్ధమే!
ABN, Publish Date - Apr 12 , 2024 | 09:07 PM
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. 48 గంటల్లోగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం తెలిపింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ సమాచారం ఉన్న ప్రతినిధి తెలిపారని పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్షంగా దాడి చేస్తే పొంచివుండే రాజకీయ ముప్పులను ఇరాన్ అంచనా వేస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. 48 గంటల్లోగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం తెలిపింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ సమాచారం ఉన్న ప్రతినిధి తెలిపారని పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్షంగా దాడి చేస్తే పొంచివుండే రాజకీయ ముప్పులను ఇరాన్ అంచనా వేస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. దాడి ప్రతిపాదినపై తుది నిర్ణయం ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వాధినేత అయాతుల్లా అలీ ఖమేనీ వద్ద ఉందని, రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తున్నట్టుగా ఆయన సలహాదారు చెప్పారని కథనం పేర్కొంది. కాగా ఇజ్రాయెల్ ఇప్పటికే గాజాలో హమాస్ లక్ష్యంగా కొన్ని నెలలుగా దాడులు చేస్తోంది. ఆ యుద్ధానికి ఎలాంటి ముగింపు లేకుండా పోరాడుతున్న సమయంలోనే ఇప్పుడు ఇరాన్‌తో తలపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
యుద్ధ మేఘాలు ఎందుకు?
సిరియాలోని డమాస్కస్‌లో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇటీవల దాడి జరిగింది. ఈ ఘటనలో ఇరాన్ టాప్ జనరల్, ఆరుగురు సైనికులతో పాటు మొత్తం 13 మంది చనిపోయారు. ఈ దాడి ఇజ్రాయెలే చేసిందని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ శపథం చేసింది. కాగా ఈ దాడి చేసింది తామేనని ఇజ్రాయెల్ ఇప్పటివరకు బాధ్యత వహించలేదు. ఈ దాడితో తమకు సంబంధంలేదని చెబుతోంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న మిలిటెంట్ గ్రూపులకు మద్దతునిచ్చిన ఇరాన్ సైనిక అధికారులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందనే ఇరాన్ ఆరోపిస్తోంది. కాగా యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని భారత్, అమెరికాతో పాటు పలు దేశాలు తమ పౌరులకే అడ్వైజరీని జారీ చేశాయి.
Updated Date - Apr 12 , 2024 | 09:09 PM