ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Iran-Israel Row: ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ ‘న్యూక్లియర్’ వార్నింగ్

ABN, Publish Date - May 12 , 2024 | 02:49 PM

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం ముదిరిన తరుణంలో.. ఇరాన్ ఓ హెచ్చరిక జారీ చేసింది. న్యూక్లియర్ బాంబ్ తయారీపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ ఇజ్రాయెల్ తమ జోలికొస్తే మాత్రం..

Iran Nuclear Warning To Israel

ఇరాన్, ఇజ్రాయెల్ (Iran-Israel Row) మధ్య ఘర్షణ వాతావరణం ముదిరిన తరుణంలో.. ఇరాన్ ఓ హెచ్చరిక జారీ చేసింది. న్యూక్లియర్ బాంబ్ తయారీపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ ఇజ్రాయెల్ తమ జోలికొస్తే మాత్రం తీవ్రంగా స్పందిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) సలహాదారుడైన కమాల్ ఖర్రాజీ (Kamal Kharrazi) వ్యాఖ్యానించారు. అవసరమైతే అణువిధానం మార్చుకునేందుకు తాము వెనుకాడబోమని తేల్చి చెప్పారు.


ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం.. ఎయిర్‌పోర్టులోనే చిన్నారి మృతదేహం

‘‘అణుబాంబును నిర్మించాలనే నిర్ణయం మేము ఇప్పటివరకూ తీసుకోలేదు. కానీ.. ఇరాన్ ఉనికికి ముప్పు ఏర్పడితే, మా సైనిక సిద్ధాంతం మార్చడం తప్ప వేరే మార్గం ఉండదు. ఒకవేళ మా అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే.. అందుకు మా ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది’’ అని కమాల్ ఖర్రాజీ హెచ్చరికలు జారీ చేశారు. కాగా.. ఇటీవల సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది. ఇందుకు ప్రతిస్పందనగానే ఇరాన్ పై విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇదివరకే ఇరాన్ వందలకొద్దీ డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది కూడా! అయితే.. ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని గాలిలోనే పేల్చేసింది.

డొనాల్డ్ ట్రంప్‌కి షాకిచ్చిన శృంగార తార.. ఆరోజు హోటల్ రూమ్‌లో..

నిజానికి.. అణ్వాయుధాల అభివృద్ధికి వ్యతిరేకంగా సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ గతంలో ఫత్వా జారీ చేశారు. అయితే.. బాహ్య ఒత్తిళ్లు, ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల నుంచి ఏదైనా ముప్పు ఉందని తెలిస్తే మాత్రం, న్యూక్లియర్ అభివృద్ధి సాధ్యపడొచ్చని 2021లో ఇంటెలిజెన్స్ మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి.. ఇరాన్ న్యూక్లియర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి.. దీనికి ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

Read Latest International News and Telugu News

Updated Date - May 12 , 2024 | 02:49 PM

Advertising
Advertising