ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Israel Hamas War: 70 మందికిపైగా మృత్యువాత.. గాజాలో పెరిగిన హింసాత్మక ఘటన

ABN, Publish Date - Jul 13 , 2024 | 07:17 AM

గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు(Israel Hamas War) ప్రస్తుతం తగ్గేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే శుక్రవారం గాజా(gaza) నగరంలో జరిగిన హింసాత్మక ఘటనలో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాత చెందారు.

Israel and Hamas war update

గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు(Israel Hamas War) ప్రస్తుతం తగ్గేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే శుక్రవారం గాజా(gaza) నగరంలో జరిగిన హింసాత్మక ఘటనలో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాత చెందారు. ఇజ్రాయెల్ ధళాలు ప్రణాళికాబద్ధంగా హత్యాకాండకు పాల్పడ్డాయని హమాస్ అధికారులు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దళాలు తూర్పు గాజా నగరం, పశ్చిమ, దక్షిణ పొరుగు ప్రాంతాల్లో కాల్పులు జరిపాయని తెలిపారు. హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ అల్ తౌబ్తా ఈ మేరకు వివరాలను వెల్లడించారు.


ప్లాన్ చేసి దాడులు

అల్ తౌబ్తా ప్రకారం తాల్ అల్-హవా ప్రాంతం నుంచి రెస్క్యూ బృందాలు 70 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయని, కనీసం 50 మంది వ్యక్తులు తప్పిపోయారని అన్నారు. మరికొందరు నిర్వాసితులైన వ్యక్తులు తెల్ల జెండాలు పట్టుకుని ఇజ్రాయెల్(Israel) సైన్యం వైపు చూపిస్తూ 'మేము యోధులం కాదు, స్థానభ్రంశం చెందామని చెప్పారని తెలిపారు. కానీ ఇజ్రాయెల్ సైన్యం ఈ నిర్వాసితులను దారుణంగా చంపేసిందని, తాల్ అల్ హవాలో ఈ మారణకాండకు ఇజ్రాయెల్ సైన్యం ప్లాన్ చేసి దాడులకు దిగిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఇజ్రాయెల్‌పై ఒత్తిడి

ఈ క్రమంలో పాలస్తీనియన్లపై(Palestinians) విధ్వంసక యుద్ధాన్ని ముగించేలా ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ గాజా నగరంలో మృతదేహాల విషయంపై ఖండించారు. ఈ వివాదం కొనసాగుతున్నప్పుడు ప్రజలకు అవసరమైన వైద్య సహాయం, వారికి అవసరమైన ఆహారం, ఆశ్రయం ఇవ్వడం అసాధ్యంగా మారిందని డుజారిక్ అన్నారు. కొనసాగుతున్న ఘర్షణలో పౌర మరణాలకు మరొక విషాద ఉదాహరణ అని పేర్కొన్నారు. దీంతో గాజాలో జరిగిన ఈ ఘటన వినాశకరమైన సంఘటనల జాబితాలో చేరింది.


ఇది కూడా చదవండి:

Hyderabad: అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ స్మగ్లర్‌ అరెస్ట్‌..

Hyderabad: మందుబాబులకు జైలుశిక్ష..


Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!

Read Latest International News and Telugu News

Updated Date - Jul 13 , 2024 | 07:24 AM

Advertising
Advertising
<