ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వచ్చిన క్షిపణిని వచ్చినట్టే..

ABN, Publish Date - Oct 03 , 2024 | 05:29 AM

ఇరాన్‌ ప్రయోగించిన బాలిస్టిక్‌ క్షిపణులు ఒకవైపు! వాటి రాకను అల్లంత దూరంలోనే పసిగట్టి అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ యారో పంపిన ఇంటర్‌సెప్టార్లు మరోవైపు!! ఒకదాన్నోకటి ఢీకొనడంతో భారీ శబ్దాలు.. పేలుళ్లు!!

ఇరాన్‌ దాడిని సమర్థంగా అడ్డుకున్న ఇజ్రాయెల్‌

కొన్ని ఆఫీసులు, నిర్వహణ ప్రదేశాల ధ్వంసం

మినహా పెద్ద స్థాయి నష్టమేదీ జరగలేదని వెల్లడి

ఇరాన్‌ ప్రయోగించిన బాలిస్టిక్‌ క్షిపణులు ఒకవైపు! వాటి రాకను అల్లంత దూరంలోనే పసిగట్టి అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ యారో పంపిన ఇంటర్‌సెప్టార్లు మరోవైపు!! ఒకదాన్నోకటి ఢీకొనడంతో భారీ శబ్దాలు.. పేలుళ్లు!!

..‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ 2’ పేరుతో ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణుల పరంపరను ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థ అమెరికా సాయంతో సమర్థంగా అడ్డుకుంది! ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిపడ్డ 400కుపైగా మిసైళ్లలో అత్యధిక క్షిపణులను.. వచ్చినదాన్ని వచ్చినట్టే నేలకూల్చామని ఐడీఎఫ్‌ (ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌) వర్గాలు వెల్లడించాయి. అయితే.. కొన్ని మిసైళ్లు మాత్రం తమ ఎయిర్‌బే్‌సలను తాకాయని, వాటివల్ల కొన్ని కార్యాలయాలు, నిర్వహణ (మెయింటెనెన్స్‌) ప్రదేశాలు దెబ్బతిన్నాయి తప్ప పెద్దస్థాయిలో విధ్వంసం జరగలేదని, పలుప్రాంతాల్లో పెద్ద పెద్ద గుంటలు మాత్రం పడ్డాయని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. తమ వైమానిక దళం ఆపరేషన్స్‌కు ఎలాంటి విఘాతం వాటిల్లలేదని.. తమ యుద్ధవిమానాలకుగానీ, డ్రోన్లు, ఇతర విమానాలు, ఆయుధాలు, కీలక మౌలిక సదుపాయాలకుగానీ ఎలాంటి డ్యామేజీ జరగలేదని తేల్చిచెప్పాయి. ఇరాన్‌ చెబుతున్నట్టుగా అవి హైపర్‌సానిక్‌ మిసైళ్లు కావని పేర్కొన్నాయి. కాగా.. ఇరాన్‌ ప్రయోగించిన ఒక బాలిస్టిక్‌ క్షిపణి శకలం వచ్చి మీదపడడంతో.. గాజా స్ట్రిప్‌లోని జెరికో వద్ద వర్క్‌ పర్మిట్‌తో పనిచేస్తున్న సమేహ్‌ అల్‌ అసలీ (37) అనే పాలస్తీనా కార్మికుడు మృతి చెందాడు. అతడి మృతదేహం పక్కనే పడి ఉన్న క్షిపణి శకలం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అదే క్షిపణి శకలాల కారణంగా మరో నలుగురు పాలస్తీనియన్లు కూడా గాయపడ్డారు. క్షిపణుల దాడిలో ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌లో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. కాగా.. ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో కొన్నింటిని తమ గగనతలంలో అడ్డుకున్నట్టు జోర్డాన్‌ ప్రకటించింది. నిజానికి ఇరాన్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఇదే తరహాలో ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. కానీ, ఇజ్రాయెల్‌ తన ‘యారో’ రక్షణ వ్యవస్థతో వాటిని సమర్థంగా కూల్చేసింది. ఆ దాడుల్లో దక్షిణ ఇజ్రాయెల్‌కు చెందిన ఏడేళ్ల బాలిక గాయపడింది.

Updated Date - Oct 03 , 2024 | 05:30 AM