హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
ABN, Publish Date - Sep 28 , 2024 | 04:17 AM
లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఉన్న హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.
బీరుట్, సెప్టెంబరు 27: లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఉన్న హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. హిజ్బుల్లాపై పోరాటం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఐక్యరాజ్య సమితిలో ప్రకటించిన కొద్ది సేపటికే ఈ దాడులు జరగడం గమనార్హం. బాంబు పేలుళ్ల ధాటికి 30 కి.మీ.దూరంలో ఉన్న ఇళ్లు కూడా కంపించాయి. ఈ దాడుల్లో కనీసం 25 మరణించినట్టు ఆరోగ్య శాఖ మంత్రి ఫిరాస్ అబియాద్ చెప్పారు. దాంతో ఈ వారంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 720 మందికి పెరిగింది. కాగా, ఇజ్రాయెల్‌తో ఉన్న దౌత్య సంబంధాలను తెంచుకోవాలని ఇరాన్ రక్షణ శాఖ మంత్రి బ్రిగేడియర్ జనరల్ అజీజ్ నాసిర్జాదేహ్ ముస్లిం దేశాలకు పిలుపునిచ్చారు.
Updated Date - Sep 28 , 2024 | 04:17 AM