Israel: ఘోరం.. వెయ్యి మంది స్పాట్ డెడ్
ABN, Publish Date - Sep 30 , 2024 | 10:39 AM
లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్(Israel) భీకర వైమానిక దాడులు జరిపింది. తాజా దాడిలో 100 మందికి పైగా మరణించారు.350 మందికి పైగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
ఇజ్రాయెల్: లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్(Israel) భీకర వైమానిక దాడులు జరిపింది. తాజా దాడిలో 100 మందికి పైగా మరణించారు.350 మందికి పైగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. శనివారం జరిగిన వైమానిక దాడుల్లో 33 మంది మృతి చెందగా, 195 మంది గాయపడ్డారు. గత రెండు వారాలుగా లెబనాన్‌లో ఐడీఎఫ్ జరుపుతున్న దాడుల్లో మృతుల సంఖ్య మొత్తంగా వెయ్యి దాటినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ హిజ్బుల్లా అగ్రనాయకత్వాన్ని అంతమొందిస్తూ వస్తోంది. సెప్టెంబర్ 27న హిజ్బుల్లా గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లాను చంపేసింది. గత వారంలో వైమానిక దాడుల్లో 7 మంది కీలక కమాండర్‌లను హతమార్చింది. టెర్రర్ గ్రూప్ సెంట్రల్ కౌన్సిల్‌లోని సీనియర్ సభ్యుడు నబిల్ కౌక్‌ను కూడా చంపేశారు. భీకర దాడులు కొనసాగుతున్నప్పటికీ హిజ్బుల్లా దళాలు ప్రతిఘటిస్తూనే ఉన్నాయి.
80 టన్నుల బాంబు దాడి..
శుక్రవారం రాత్రి 9:30కు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నస్రల్లా మరణించినట్లు హిజ్బుల్లా శనివారం ప్రకటించింది. బీరుట్‌లోని హిజ్బుల్లా(Hezbollah) ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం 80 టన్నుల బాంబుతో దాడి చేసింది. నస్రల్లా తన కుమార్తెతో అక్కడ ఉన్నాడని తెలిసింది. బాంబు దాడి అనంతరం.. ఇజ్రాయెల్ సైన్యం తన సోషల్ మీడియా ఖాతాలలో "హసన్ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయపెట్టలేడు" అని పోస్ట్ చేసింది. నస్రల్లా మరణం తరువాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి.
అత్యవసర సమావేశానికి పిలుపు..
నస్రల్లా మృతితో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. దక్షిణ బీరుట్‌లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. నస్రల్లాను అంతమొందించడంతో ఖమేనీని సురక్షిత ప్రదేశానికి తరలించారు.
తొలిసారి బీరుట్‌పై దాడి..
లెబనాన్ రాజధాని బీరుట్ (Beirut) నగరంలోని ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ నగరంలోని నివాస సముదాయాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) దాడులు చేయడం ఇదే తొలిసారి. కోలా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ భవనం పైఅంతస్తుపై ఐడీఎఫ్ బాంబులు ప్రయోగించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసిన ఇజ్రాయెల్.. ఇప్పుడు నివాస సముదాయాలపైనా విరుచుకుపడటంతో ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.
Tour Plans: లాంగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఇవైతే బెస్ట్
Gold Prices Today: మగువలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు
For Latest News and National News click here
Updated Date - Sep 30 , 2024 | 10:47 AM