ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Alexei Navalny: పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ జైలులో హఠాన్మరణం

ABN, Publish Date - Feb 16 , 2024 | 06:22 PM

రష్యా రాజకీయాల్లో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. విపక్ష నేత, పుతిన్‌కు గట్టి విమర్శకుడిగా పేరున్న అలెక్సీ నావల్నీ శుక్రవారంనాడు జైలులో హఠాన్మరణం చెందారు. నావెల్నీ జైలులో నడుస్తూ అస్వస్థతకు గురై కన్నుమూసినట్టు ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ ప్రకటించింది. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేలోపు ఆయన కన్నుమూసినట్టు పేర్కొంది.

మాస్కో: రష్యా (Russia) రాజకీయాల్లో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. విపక్ష నేత, పుతిన్‌కు గట్టి విమర్శకుడిగా పేరున్న అలెక్సీ నావల్నీ (Alexei Navalny) శుక్రవారంనాడు జైలులో హఠాన్మరణం చెందారు. నావెల్నీ జైలులో నడుస్తూ అస్వస్థతకు గురై కన్నుమూసినట్టు ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ ప్రకటించింది. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేలోపు ఆయన కన్నుమూసినట్టు పేర్కొంది. నావల్నీ మరణ వార్త ఇటు దేశ రాజకీయ వర్గాల్లోనే కూకుండా, అంతర్జాతీయ సమాజాన్ని కుదిపేసింది. సుదీర్ఘ కాలం జైలు శిక్ష పడటం, అసమ్మతిని, విపక్షాల గొంతును పుతిన్ అణిచివేయాలనుకుంటున్నారంటూ గతంలో పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో నావల్నీ మరణం పలు ప్రశ్నలకు తావిస్తోంది. రాజకీయ ఉద్దేశాలు, ప్రభుత్వ జవాబుదారీతంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


నావల్నీ తన రాజకీయ కెరీర్‌లో ప్రధానంగా రష్యాలోని ప్రజాస్వామ్యం, జవాబుదారీతనంపై గళం వినిపించేవారు. భయం అనేది లేకుండా న్యాయం కోసం ఆయన చేసిన అవిశ్రాంత పోరాటానికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు, మద్దతు లభించేవి. అనేక సార్లు బెదరింపులు వచ్చినా ఆయన లెక్కచేసే వారు కాదు. అవినీతికి వ్యతిరేకంగా, అధికారంలో ఉన్నవారి జవాబుదారీతనాన్ని నిలదీయడంలో ముందుండేవారు. కాగా, అలెక్సీ నావల్నీ మరణానికి సంపాతాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మరణంపై నిష్పాక్షిక విచారణ జరపాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.-

Updated Date - Feb 16 , 2024 | 06:22 PM

Advertising
Advertising