ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Washington: భారతీయ విద్యార్థులపై దాడిని సహించబోమన్న అమెరికా.. కీలక వ్యాఖ్యలు చేసిన వైట్ హౌస్

ABN, Publish Date - Feb 16 , 2024 | 08:20 AM

తమ దేశంలో భారతీయ విద్యార్థులపై దాడి, హత్యలను ఖండిస్తున్నట్లు అమెరికా(America) తెలిపింది. వారిపై దాడులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వైట్ హౌస్(White House) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇండియన్స్‌పై దాడులు పెరుగుతున్నాయి.

వాషింగ్టన్: తమ దేశంలో భారతీయ విద్యార్థులపై దాడి, హత్యలను ఖండిస్తున్నట్లు అమెరికా(America) తెలిపింది. వారిపై దాడులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వైట్ హౌస్(White House) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇండియన్స్‌పై దాడులు పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో వైట్ హౌస్‌లోని జాతీయ భద్రతా మండలి వ్యూహాత్మక కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ మాట్లాడుతూ.. "అమెరికాలో హింసకు తావు లేదు. జరుగుతున్న దాడులు జాతి, మతం, జెండర్ ఆధారంగా జరుగుతున్నట్లు గుర్తించాం. వీటిని అడ్డుకోవడానికి స్థానిక అధికారులతో కలిసి పని చేస్తున్నాం" అని చెప్పారు. డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్న వివేక్ సైనీ అనే భారతీయ విద్యార్థిని ఓ ఆగంతకుడు కాల్చి చంపాడు.


ఇండియానా వెస్లియన్ యూనివర్సిటీలో సయ్యద్ మజాహిర్ అలీ అనే విద్యార్థిపై ఇటీవలే దాడి చేశారు. సిన్సినాటీ యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలోనే చదువుతున్న నీల్ ఆచార్య కూడా ఇటీవల ప్రాణాలు కోల్పోయాడు. 2023 నవంబర్‌లో సిన్సినాటి యూనివర్సిటీకి చెందిన ఆదిత్యను.. ఒహియో నగరంలో కాల్చి చంపారు.

ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న 18 ఏళ్ల అకుల్ ధావన్‌ జనవరిలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గుర్తించారు. ఇలా వరుసగా అనుమానాస్పద మరణాలు సంభవించడం.. అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయ కుటుంబాలకు ఆందోళనకు గురి చేస్తోంది. తమ పిల్లలకు ప్రాణ భయం ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దాడులను ఆపేందుకు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 16 , 2024 | 08:37 AM

Advertising
Advertising