ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మొస్సాద్‌ యమా డేంజర్‌!

ABN, Publish Date - Aug 05 , 2024 | 02:43 AM

మొస్సాద్‌..! ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత శక్తిమంతమైన నిఘా, స్పెషల్‌ ఆపరేషన్ల సంస్థ..! ఈ సంస్థ ఒక ఆపరేషన్‌ను ఎంచుకుంటే.. శత్రువు అంతంతోనే అది ముగుస్తుంది.

  • శత్రువుపై విష ప్రయోగంలో దిట్ట.. టార్గెట్‌ చేస్తే ప్రత్యర్థి అంతమే

మొస్సాద్‌..! ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత శక్తిమంతమైన నిఘా, స్పెషల్‌ ఆపరేషన్ల సంస్థ..! ఈ సంస్థ ఒక ఆపరేషన్‌ను ఎంచుకుంటే.. శత్రువు అంతంతోనే అది ముగుస్తుంది. హిట్‌లిస్టులో ఉన్న శత్రువు భూప్రపంచంలో ఎక్కడ దాక్కొని ఉన్నా.. వెతికి, వేటాడి చంపడం మొస్సాద్‌ స్టైల్‌..! విదేశీ గడ్డపై విషప్రయోగాలు.. బాంబు దాడులు.. క్షిపణి దాడులతో శత్రువును మట్టుబెడుతుంది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఆశ్రయం పొందుతున్న హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియే హత్యతో మరోసారి మొస్సాద్‌ పేరు వార్తల్లోకెక్కింది.

టూత్‌ పేస్టుతో హైజాకర్‌ హత్య

1978లో అఫ్ఘానిస్థాన్‌లోని బగ్దాద్‌లో వాదీ హదాద్‌ హత్య ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తోంది. ఆయన లిబరేషన్‌ ఆఫ్‌ పాలస్తీనా ధ్యేయంగా ఏర్పాటైన పాపులర్‌ ఫ్రంట్‌ సంస్థకు చీఫ్‌. 1976లో టెల్‌అవీవ్‌ విమానాశ్రయంలో ‘ఎయిర్‌ ఫ్రాన్స్‌’ విమానాన్ని హైజాక్‌ చేశాడు. అప్పట్లో లెఫ్టెనెంట్‌ కల్నల్‌ యోనతాన్‌ నెతన్యాహు (ప్రస్తుత ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సోదరుడు) నేతృత్వంలో ‘థండర్‌బోల్ట్‌’ పేరుతో నిర్వహించిన ఆపరేషన్‌లో బందీలను విడిపించగలిగారు. ఈ పోరులో యోనతాన్‌ నెతన్యాహు వీరమరణం పొందారు.

దాంతో ఇజ్రాయెల్‌ హిట్‌లిస్టులోకి వాదీ హదాద్‌ చేరాడు. బగ్దాద్‌లో తలదాచుకున్న వాదీని తుదముట్టించేందుకు ‘ఏజెంట్‌ సాడ్‌నె్‌స’ను రంగంలోకి దిగాడు. అతను బగ్దాద్‌లోని వాదీ ఇంట్లో పనివాడిలా చేరాడు. 1978 జనవరి 10న వాదీ వాడే టూత్‌పేస్టును మార్చి ఇజ్రాయెల్‌ తయారు చేసిన విషపు టూత్‌పేస్టును పెట్టాడు. ఆ పేస్టును వాడిన వాదీ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. జర్మనీకి తరలించినా వైద్యులు ఆయనను బతికించలేకపోయారు.


1978 మార్చి 29న వాదీ చనిపోయాడు. అయితే 3 దశాబ్దాలు దాటే వరకు.. అతను చనిపోవడానికి కారణం విషపు టూత్‌పేస్టు అనే విషయం బయటి ప్రపంచానికి తెలియదు. పాలస్తీనా లిబరేషన్‌ కోసం ఖలీల్‌ మెషాల్‌ జోర్దాన్‌లో తలదాచుకుంటూనే ఇజ్రాయెల్‌పై దాడులకు వ్యూహాలను రచించి, అమలు చేశాడు. 1997లో మొస్సాద్‌ ఏజెంట్లు ఇతణ్ని ఇజ్రాయెల్‌లో చంపేందుకు స్కెచ్‌ వేశారు. ఖలీద్‌ చెవిలో విషాన్ని పిచికారీ చేశారు. దాంతో ఖలీద్‌ కోమాలోకి వెళ్లిపోయాడు. ఈ ఘటన అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు కారణమవ్వడంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ రంగంలోకి దిగారు. ఆయన ఒత్తిడితో ఇజ్రాయెల్‌ విరుగుడును అందజేసింది.

హనియే, డైఫ్‌ ఖతం

గత ఏడాది అక్టోబరు 7న హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే..! హమాస్‌ అగ్రనాయకులు కొందరు ఆ దృశ్యాలను లైవ్‌లో చూస్తూ.. ‘థాంక్స్‌ గీవింగ్‌’ ప్రార్థనలు నిర్వహించారు. అలా ప్రార్థనలు చేస్తున్న వీడియోల్లో ఉన్నవారంతా ఇప్పుడు ఇజ్రాయెల్‌ హిట్‌లిస్టులో చేరిపోయారు. వీరిలో ఇస్మాయిల్‌ హనియే, మహమ్మద్‌ అల్‌-డై్‌ఫను ఇజ్రాయెల్‌ ఇటీవలే తుదముట్టించింది.


చిక్కుల్లో 33 మంది ఏజెంట్లు

ఆపరేషన్ల సమయంలో ఏజెంట్లు చిక్కుల్లో పడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి. ఇరాన్‌ ఇలా 20 మంది దాకా మొస్సాద్‌ ఏజెంట్లను నిర్బంధించినట్లు గత ఏడాది వార్తలు వచ్చాయి. తుర్కియేలోనూ 33 మంది ఏజెంట్లు చిక్కారు. గాజాలో సైనిక విభాగం-పొలిటికల్‌ బ్యూరో మధ్య ఫాతిమా హమాద్‌ సంధానకర్తగా ఉన్నారు.

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఆమె తుర్కియేలో తలదాచుకుంటున్నారు. ఫాతిమాను తుదముట్టించేందుకు 50 మంది దాకా మొస్సాద్‌ ఏజెంట్లు తుర్కియేలో వేట ప్రారంభించారు. ఈ క్రమంలో 33 మంది ఏజెంట్లను అరెస్టు చేసినట్లు తుర్కియే గత ఏడాది డిసెంబరులో ప్రకటించింది. గూఢచర్యం నేరం కింద వీరికి ఉరిశిక్ష విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

-సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Aug 05 , 2024 | 02:44 AM

Advertising
Advertising
<