ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హిజ్బుల్లాకు మరో దెబ్బ ఇజ్రాయెల్‌ దాడిలో కమాండర్‌ కౌక్‌ మృతి

ABN, Publish Date - Sep 30 , 2024 | 04:01 AM

లెబనాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు మరో గట్టి దెబ్బ తగిలింది. గడిచిన మూడ్రోజులుగా.. హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా సహా.. కీలక నాయకులు హతమవ్వగా.. ఆదివారం ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) జరిపిన దాడుల్లో మరో కీలక నేత నబీల్‌ కౌక్‌ హతమయ్యాడు.

  • నస్రల్లా గుట్టు చెప్పింది ఇరాన్‌ గూఢచారే..

  • బంకర్‌పై దాడిలో మృతుల సంఖ్య 20కి

  • హిజ్బుల్లా కొత్త చీఫ్‌గా హషీమ్‌ సఫీద్దీన్‌

  • బీరుట్‌పై కొనసాగుతున్న దాడులు

  • మరో 33 మంది ఉగ్రవాదుల మృతి

  • నస్రల్లా మృతదేహం గుర్తింపు.. ఆస్పత్రికి తరలింపు

బీరుట్‌/టెల్‌అవీవ్‌, సెప్టెంబరు 29: లెబనాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు మరో గట్టి దెబ్బ తగిలింది. గడిచిన మూడ్రోజులుగా.. హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా సహా.. కీలక నాయకులు హతమవ్వగా.. ఆదివారం ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) జరిపిన దాడుల్లో మరో కీలక నేత నబీల్‌ కౌక్‌ హతమయ్యాడు. ఆయన హిజ్బుల్లా సెంట్రల్‌ కౌన్సిల్‌ డిప్యూటీ చీఫ్‌గా.. దక్షిణ లెబనాన్‌లో మిలటరీ కమాండర్‌గా ఉన్నట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది. ఆదివారం బీరుట్‌లోని దహియా ప్రాంతంలో 120 స్థావరాలు, కఫ్రాలోని 45 ఆయుధాగారాలపై జరిపిన వరుస దాడుల్లో మొత్తం 33 మంది మృతిచెందగా.. 195 మంది గాయపడ్డట్లు తెలిపింది. కాగా.. నస్రల్లాతోపాటు బంకర్‌లో చనిపోయినవారి సంఖ్య 20గా ఉన్నట్లు.. మృతుల్లో హిజ్బుల్లా కమాండర్‌ అలీ కరాకీ ఉన్నట్లు వివరించింది.

నిజానికి అలీ కరాకీ లక్ష్యంగా ఇటీవలే లెబనాన్‌-సిరియా సరిహద్దుల్లో దాడులు జరిపినా.. అతను తప్పించుకున్నట్లు వెల్లడించింది. నస్రల్లా మరణంతోపాటు.. హిజ్బుల్లాలో నెంబర్‌-3గా ఉన్న అలీ కరాకీ, కీలక కమాండర్‌ నబీల్‌ కౌక్‌ మృతిచెందడం ఆ ఉగ్ర సంస్థకు కోలుకోలేని దెబ్బ అని ఐడీఎఫ్‌ భావిస్తోంది. మరోవైపు.. అంతా ఊహించినట్లుగానే తమ తదుపరి చీఫ్‌గా హషీమ్‌ సఫీద్దీన్‌ నస్రల్లా నియమితులైనట్లు హిజ్బుల్లా ప్రకటించింది. కాగా.. బీరుట్‌లో నస్రల్లా ఉన్న బంకర్‌ సమాచారం ఇరాన్‌కు చెందిన ఓ గూఢచారి ద్వారా ఇజ్రాయెల్‌కు అందినట్లు ఫ్రాన్స్‌కు చెందిన పత్రిక ‘ల పర్షియా’ ఓ కథనాన్ని ప్రచురించింది.


నస్రల్లాతోపాటు.. ఇరాన్‌ ప్రతినిధి, మరికొందరు హిజ్బుల్లా కమాండర్లు ఆ బంకర్‌లో ఉన్నట్లు నిర్ధారించుకున్నాకే.. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరిపినట్లు ఆ కథనం పేర్కొంది. మరోవైపు ఆదివారం ఉదయం లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దహియాలోని బంకర్‌ శిథిలాల నుంచి నస్రల్లా మృతదేహాన్ని వెలికి తీసింది. ‘‘జెరూసలేం వెళ్లే దారిలో అమరుడైన ఓ వీరుడా’’ అని అరబిక్‌లో రాసిన ఓ శవపేటికలో మృతదేహాన్ని పెట్టి, బీరుట్‌ ఆస్పత్రికి తరలించింది. హిజ్బుల్లా వర్గాలు ఆ శవపేటిక ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

  • ఇజ్రాయెల్‌ హైఅలెర్ట్‌!

హిజ్బుల్లా కీలక నేతలను తుదముట్టించినా.. ఆ ఉగ్ర సంస్థపై యుద్ధం పూర్తవ్వలేదని ఇజ్రాయెల్‌ చెబుతోంది. తాజాగా హిజ్బుల్లా అగ్రనాయకులు బ్లాక్‌ యూనిట్‌/షాడో యూనిట్‌ అనే పేర్లున్న యూనిట్‌-910ను ఇజ్రాయెల్‌పై పోరాటానికి రంగంలోకి దించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఐడీఎఫ్‌ మరింత అప్రమత్తమైంది. నస్రల్లా నాయకత్వంలో ఈ యూనిట్‌ బలపడడమే కాకుండా.. విదేశాలకు విస్తరించింది. అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇజ్రాయెల్‌ జాతీయులను లక్ష్యంగా చేసుకుని, దాడులు జరపడం ఈ యూనిట్‌ ప్రత్యేకత. ఐడీఎఫ్‌ 32 ఏళ్ల క్రితం అప్పటి హిజ్బుల్లా చీఫ్‌ అబ్బాస్‌ అల్‌-ముసావిని తుదముట్టించాక.. ఇజ్రాయెల్‌ను టార్గెట్‌గా చేసుకుని, ప్రతిదాడులు జరిపింది కూడా యూనిట్‌-910 కావడం గమనార్హం..! కాగా.. లెబనాన్‌లో భూతల దాడులకు ఐడీఎఫ్‌ సిద్ధమవుతున్నట్లు అమెరికా అంచనా వేస్తోంది. పరిమిత దూరం వరకు భూతల దాడులు ఉంటాయని, గాజాలో మాదిరిగా బుల్‌డోజర్లతో వెళ్లే బలగాలు.. ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

  • హౌతీలపై డ్రోన్‌ దాడులు

యెమన్‌లోని హౌతీల స్థావరాలను లక్ష్యం గా చేసుకుని, ఆదివారం డజన్ల కొద్దీ డ్రోన్‌లను ప్రయోగించినట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది. ఈ దాడుల్లో యెమన్‌ హుడైదా నౌకాశయం, భారీ విద్యుత్తు కేంద్రం, ఇంధన పైపు లైన్లు ధ్వంస మయ్యాయి. అటు.. గాజాలో హమా్‌సకు చెందిన ఒక కిలోమీటరు పొడవైన సొరంగాన్ని గుర్తించినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది.

Updated Date - Sep 30 , 2024 | 04:01 AM