హిజ్బుల్లాకు మరో దెబ్బ.. ఐడీఎఫ్ దాడుల్లో నస్రల్లా అల్లుడి మృతి
ABN, Publish Date - Oct 04 , 2024 | 04:47 AM
హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు మరో భారీ దెబ్బ తగిలింది. గురువారం సిరియాలోని డమాస్క్‌సపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) జరిపిన క్షిపణి దాడుల్లో.. హిజ్బుల్లాకు ఆ యుధాల సరఫరా, నిధుల సమీకరణ వ్యవహారాలను పర్యవేక్షించే హసన్ జాఫర్ అల్-ఖాసిర్ మృతిచెందాడు.
అతని ద్వారానే హిజ్బుల్లాకు ఫండింగ్
సిరియాపై దాడుల్లో హతం
ఐఆర్‌జీసీ సలహాదారు కూడా
టెల్‌అవీవ్, అక్టోబరు 3: హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు మరో భారీ దెబ్బ తగిలింది. గురువారం సిరియాలోని డమాస్క్‌సపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) జరిపిన క్షిపణి దాడుల్లో.. హిజ్బుల్లాకు ఆ యుధాల సరఫరా, నిధుల సమీకరణ వ్యవహారాలను పర్యవేక్షించే హసన్ జాఫర్ అల్-ఖాసిర్ మృతిచెందాడు. ఇటీవల బీరుట్‌లో జరిపిన దాడుల్లో మృతి చెందిన హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాకు ఈయన అల్లుడు. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్(ఐఎస్), గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హిజ్బుల్లాతోపాటు.. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్(ఐఆర్‌జీసీ)కి ఖాసిర్ ప్రధాన సంధానకర్త కావడం గమనార్హం..! ఇరాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను సరఫరా చేసేది కూడా ఖాసిరేనని ఐడీఎఫ్ చెబుతోంది.
అటు నస్రల్లా, ఇటు ఖాసిర్ మృతితో.. హిజ్బుల్లాకు దిశానిర్దేశంచేసే నేతలు కరువయ్యారని ఐడీఎఫ్ భావిస్తోంది. డమాస్క్‌సపై రెండ్రోజుల క్రితం జరిపిన క్షిపణి దాడిలో ఐఆర్‌జీసీ సలహాదారు మాజిద్ దివానీ హతమైనట్లు ప్రకటించింది. మాజిద్ మరణంతో ఇరాన్ మరోమారు ఇజ్రాయెల్‌పై దాడులుచేసే ప్రమాదముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీరుట్‌లోని హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్, ఇన్ఫర్మేషన్ కార్యాలయాలను వైమానికదాడుల్లో నేలమట్టం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈఘటనల్లో 9మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు.. మూణ్నెల ్లక్రితం సెంట్రల్ గాజాలో తాము జరిపిన క్షిపణి దాడిలో హమాస్ అప్రకటిత ప్రధాని రావ్హీ ముస్తాహా మృతిచెందినట్లు ఐడీఎఫ్ గురువారం నిర్ధారించింది.
ఇజ్రాయెల్‌లో 12 మంది మృతి
లెబనాన్ నుంచి హిజ్బుల్లా ప్రయోగించిన క్షిపణులను చాలా వరకు తమ ఐరన్‌డోమ్ వ్యవస్థ అడ్డుకున్నా.. ఓ మిసైల్ గోలన్‌హైట్స్‌లోని మజ్దల్ షమ్స్ ప్రాంతంలో పడిందని ఐడీఎఫ్ వివరించింది. ఈ ఘటనలో 12 మంది చిన్నారులు, యువకులు మృతిచెందినట్లు ప్రకటించింది. ఈ దాడికి కారకుడైన ఉగ్రవాదిని హతమార్చినట్లు వెల్లడించింది.
ఇరాన్ హిట్‌లిస్ట్..!
ఇరాన్ హిట్‌లిస్ట్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్టర్ హల్‌చల్ చేస్తోంది. ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీతోపాటు.. ఐఆర్‌జీసీకి చెందిన పలువురు కమాండర్లు ఇజ్రాయెల్ హిట్‌లిస్టులో ఉన్న ట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..! తాజాగా.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గలాంట్, ఆర్మీ చీఫ్ జనరల్ హెర్జీ హలేవి, డిప్యూటీ చీఫ్ ఆమిర్ బరమ్, ఇతర అధికారులు ఇరాన్ హిట్‌లిస్టులో ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్టర్లు చక్కర్లు కొడుతున్నాయి.
Updated Date - Oct 04 , 2024 | 04:47 AM