ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nepal: ప్రధానికి తప్పిన గండం...విశ్వాసపరీక్షలో గెలుపు

ABN, Publish Date - Mar 13 , 2024 | 06:00 PM

రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ కు భారీ ఉమశమనం లభించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో ఆయన గెలిచారు. దహల్‌కు అనుకూలంగా 157 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 110 ఓట్లు పోలయ్యాయి. ఒకరు గైర్హాజరయ్యారు.

ఖాట్మండు: రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ (Pushpa Kamal Dahal - Prachanda)కు భారీ ఉమశమనం లభించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్ష (Vote of Confidence)లో ఆయన గెలిచారు. దహల్‌కు అనుకూలంగా 157 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 110 ఓట్లు పోలయ్యాయి. ఒకరు గైర్హాజరయ్యారు. మొత్తం 268 ఓట్లు పోలయ్యాయి. 2022 డిసెంబర్‌లో ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి విశ్వాస పరీక్షకు ఆయన వెళ్లడం ఇది మూడోసారి. నేపాల్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం, అధికార కూటమి నుంచి భాగస్వామ్య పార్టీ ఎవరైనా మద్దతు ఉపసంహరించుకుంటే ప్రధాని విశ్వాస పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రచండ ఇటీవల నేపాలీ కాంగ్రెస్ పార్టీతో పొత్తును తెగతెంపులు చేసుకుని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్‌ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్)తో పొత్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మూడోసారి పార్లమెంటులో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు.

Updated Date - Mar 13 , 2024 | 06:00 PM

Advertising
Advertising