ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kim Jong Un: కిమ్ జాంగ్ ఉన్ దూకుడు.. మళ్లీ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించిన ఉత్తరకొరియా

ABN, Publish Date - Sep 12 , 2024 | 07:59 AM

ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణులు కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య జలాల్లో పడడానికి ముందే 360 కిలో మీటర్ల దూరంలో ఉండగానే గుర్తించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు.

సియోల్: అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సారధ్యంలోని ఉత్తరకొరియా మరొకసారి దూకుడు చర్యకు పాల్పడింది. దేశ తూర్పు తీరం వైపు పలు స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత ఈ ప్రయోగాన్ని చేపట్టిందని దక్షిణ కొరియా తెలిపింది. ప్రత్యర్థులతో యుద్ధానికి తమ అణ్వాయుధ శక్తిని పూర్తిగా సంసిద్ధంగా ఉంచుతామంటూ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ ప్రయోగం జరిగిందని దక్షిణకొరియా పేర్కొంది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణులు కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య జలాల్లో పడడానికి ముందే 360 కిలో మీటర్ల దూరంలో ఉండగానే గుర్తించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు.


క్షిపణి ప్రయోగాన్ని తాము కూడా గుర్తించామని జపాన్ పేర్కొంది. అయితే ప్రయోగించిన క్షిపణి ఏ రకమైనదనేది స్పష్టంగా తెలియరాలేదని, అయితే బాలిస్టిక్ క్షిపణి అని భావిస్తున్నట్టు జపాన్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. నౌకలు, విమానాల భద్రతను నిర్ధారించాలంటూ అధికారులను జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆదేశించినట్టు కథనాలు కూడా వెలువడుతున్నాయి. అయితే ఏమైనా నష్టం జరిగిందా అనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు.


ఉత్తరకొరియా, దక్షిణకొరియాల మధ్య సంబంధాల క్షీణతలో ఇది తాజా పరిణామం. దీంతో దక్షిణ కొరియాపై దాడి చేయడానికి కిమ్ సిద్ధమవుతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత ఉత్తర కొరియా బహిరంగంగా ఆయుధాలకు సంబంధించిన ప్రయోగాలు చేపట్టడడం ఇదే తొలిసారి. అమెరికా-దక్షిణ కొరియా-జపాన్ సంయుక్తంగా చేపట్టిన సైనిక విన్యాసానికి ప్రతిస్పందనగా జులై 1న ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఆ తర్వాత తిరిగి మళ్లీ ఇప్పుడే బహిరంగంగా ప్రయోగం చేసింది.


అణ్వాయుధాలను పెంచుకుంటామన్న కిమ్..

ఇటీవలే ఉత్తరకొరియా దినోత్సవ ప్రసంగంలో కిమ్ జాంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచడానికి నిర్మాణాత్మక విధానాన్ని అమలు చేస్తామని ఆయన అన్నారు. ఉత్తర కొరియా తన అణు సామర్థ్యాన్ని, దేశ భద్రతా హక్కులను కాపాడుకోవడానికి ఏ సమయంలోనైనా ఈ ఆయుధాలను ఉపయోగించుకోవడానికి సంసిద్ధంగా ఉంటుందని అన్నారు. ఈ మేరకు సిద్ధమవ్వాలని సేనలకు పిలుపునిచ్చారు.

Updated Date - Sep 12 , 2024 | 08:26 AM

Advertising
Advertising