Oscar Awards: జూనియర్ రాబర్డ్ డౌనీకి ఆస్కార్ అవార్డు.. భార్యకు అంకితం
ABN, Publish Date - Mar 11 , 2024 | 08:46 AM
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు జూనియర్ రాబర్ట్ డౌనీని వరించింది. 96వ ఆస్కార్ అవార్డుల్లో రాబర్ట్ డౌనీ ఉత్తమ సహాయ నటుడి అవార్డు గెలుచుకున్నారు. ఓపెన్ హైమర్ చిత్రంలో అద్భుత నటనకు గాను అవార్డు దక్కింది. ఆ సినిమాలో లూయిస్ స్ట్రాస్ పాత్రలో రాబర్ట్ డౌనీ జీవించారు. ఆ పాత్రలో నటనకుగానూ విమర్శకుల ప్రశంసలు పొందారు. డౌనీ తరంలో ఉత్తమ నటుల్లో ఒకరిగా నిలిచారు. కెరీర్‌లో తొలి ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు.
ఏబీఎన్ ఇంటర్నెట్: అమెరికా లాస్ ఏంజెల్స్‌లో గల డాల్బీ థియేటర్ వేదికగా 96వ ఆస్కార్ అవార్డుల (Oscar Awards) ప్రదానోత్సవం జరుగుతోంది. ఆస్కార్ అవార్డు జూనియర్ రాబర్ట్ డౌనీని (Robert Downey Jr) వరించింది. రాబర్ట్ డౌనీకి ఉత్తమ సహాయ నటుడి అవార్డు గెలుచుకున్నారు. ఓపెన్ హైమర్ చిత్రంలో అద్భుత నటనకు గాను అవార్డు దక్కింది. ఆ సినిమాలో లూయిస్ స్ట్రాస్ పాత్రలో రాబర్ట్ డౌనీ (Robert Downey Jr) జీవించారు. ఆ పాత్రలో నటనకుగానూ విమర్శకుల ప్రశంసలు పొందారు. డౌనీ తరంలో ఉత్తమ నటుల్లో ఒకరిగా నిలిచారు. కెరీర్‌లో తొలి ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ఓపెన్ హైమర్ సినిమా పలు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగంలో ఓపెన్ హైమర్ సినిమా అవార్డులను గెలుచుకుంది.
ఆస్కార్ అవార్డు వరించడంతో రాబర్ట్ డౌనీ ఉద్వేగానికి గురయ్యారు. ఓపెన్ హైమర్ చిత్ర యూనిట్, నటీనటులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్లను విజయాలుగా మార్చే సమయంలో భార్య సుసాన్ డౌనీ అండగా నిలిచారని తెలిపారురు. ఆస్కార్ అవార్డును భార్యకు అంకితం చేస్తున్నానని సభ వేదిక నుంచి ప్రకటించారు.
ఆస్కార్ అవార్డు గెలుచుకొని కెరీర్‌లో మరో మైలురాయిని రాబర్ట్ డౌనీ చేరుకున్నారు. చిత్ర రంగంలో అసమాన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞతో హాలీవుడ్ ఐకాన్‌గా నిలుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి అభిమానం పొందుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 11 , 2024 | 08:46 AM