ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Floods In Afghanistan: 200 మందికిపైగా మృతి

ABN, Publish Date - May 11 , 2024 | 09:05 PM

అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. దీంతో 200 మందికి పైగా ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి శనివారం వెల్లడించింది. దీంతో ఉన్నతాధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారని తెలిపింది.

కాబూల్, మే 11: అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. దీంతో 200 మందికి పైగా ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి శనివారం వెల్లడించింది. దీంతో ఉన్నతాధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారని తెలిపింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి 62 మంది మృతి చెందారంది.

AP Elections: కొన్ని గంటల్లోనే అసలు ఘట్టం ప్రారంభం


ఈ భారీ వర్షాలు వరదల కారణంగా.. వందలాది గృహాలు నేలమట్టమయ్యాయని పేర్కొంది. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించిందంది. అలాగే వందలాది మంది గాయపడ్డారని.. వారందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఐక్య రాజ్యసమితి తెలిపింది. మరోవైపు ఈ వర్షాల వరదలతో ఉత్తర అఫ్గాన్ ప్రాంతం అతలాకుతలమైందని తాలిబన్ అధికార ప్రతినిధి తెలిపారు.

Elections: ప్రయాణికులతో నిండిపోయిన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు

ఈ వర్షాల దాటికి పలు ప్రావిన్స్‌ల్లోని ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. ఈ వర్షం దాటికి బఘ్లన్ ప్రావిన్స్‌పై తీవ్ర ప్రభావం చూపిందని వివరించారు. ఇక ఈ ప్రావిన్స్‌లోని వ్యవసాయ భూములను సైతం ఈ వరదలు ముంచెత్తాయని చెప్పారు. ఈ వర్షాలు, వరదలతో వందాలది మంది పౌరులకు మరణించారని ప్రభుత్వ ప్రతినిధి జైబుల్లా ముజహిద్ ఎక్స్ వేదికగా శనివారం వెల్లడించారు.

LokSabha Elections: తనయుడి భవిష్యత్తుపై స్పందించిన మేనకా గాంధీ

Read Latest National News And Telugu News

Updated Date - May 11 , 2024 | 09:07 PM

Advertising
Advertising