ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mozambique Coast: మొజాంబిక్ తీరంలో విషాదం.. బోటు మునిగి 91 మంది మృతి

ABN, Publish Date - Apr 08 , 2024 | 07:17 AM

మొజాంబిక్‌లోని ఉత్తర తీరంలో ఓ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక బోటు మునిగి ఏకంగా 91 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిమితికి మించి ఎక్కువ మంది కూర్చోవడం వల్లే.. ఆ పడవ మునిగిందని స్థానిక అధికారులు చెప్తున్నారు. దాదాపు 130 మందితో కూడిన ఫిషింగ్ బోటు.. నాంపులా ప్రావిన్స్‌లోని ఒక ద్వీపానికి బయలుదేరింది.

మొజాంబిక్‌లోని (Mozambique) ఉత్తర తీరంలో ఓ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక బోటు మునిగి ఏకంగా 91 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిమితికి మించి ఎక్కువ మంది కూర్చోవడం వల్లే.. ఆ పడవ మునిగిందని స్థానిక అధికారులు చెప్తున్నారు. దాదాపు 130 మందితో కూడిన ఫిషింగ్ బోటు.. నాంపులా ప్రావిన్స్‌లోని (Nampula Province) ఒక ద్వీపానికి బయలుదేరింది. అయితే.. కొంత దూరం ప్రయాణించిన తర్వాత అనుకోని సమస్య తలెత్తింది. 130 మందిని మోసే సామర్థ్యం ఆ బోటుకి లేకపోవడం వల్ల అది మునిగింది. దీంతో.. 91 మంది నీటిలో మునిగి మృతి చెందారు.

విజయానికి ఒక్క అడుగు దూరంలోనే.. అప్పటిదాకా తగ్గేదేలేదన్న ఇజ్రాయెల్ ప్రధాని


‘‘ఆ బోటులో పరిమితికి మించి ఎక్కువ మంది కూర్చున్నారు. అంతమందిని తీసుకెళ్లేందుకు అది అనువైన పడవ కాదు. అందుకే.. మార్గమధ్యంలో సమస్య తలెత్తి అది మునిగింది. తద్వారా 91 మంది ప్రాణాలు కోల్పోయారు’’ అని నాంపులా రాష్ట్ర కార్యదర్శి జైమ్ నెటో (Jaime Neto) చెప్పారు. మృతుల్లో చాలామంది చిన్నారులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే సహాయక బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అన్నారు. ఐదుగురిని కాపాడగలిగారని, ఇతరుల కోసం గాలిస్తున్నారని చెప్పారు. అయితే.. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, రెస్క్యూ ఆపరేషన్ కష్టతరంగా సాగుతోందని పేర్కొన్నారు.

Bird Flu: ముంచుకొస్తున్న ‘బర్డ్‌ఫ్లూ’ ముప్పు.. కొవిడ్ కన్నా 100 రెట్లు ప్రమాదకరం

కాగా.. నాంపులాలో కలరా (Cholera) వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటైన ఈ దక్షిణాఫ్రికా దేశంలో అక్టోబర్ నుంచి 15వేల కలరా వ్యాధుల కేసులు నమోదయ్యాయి. అందులో 32 మంది మృతి చెందారు. ముఖ్యంగా.. నాంపులాలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలందరూ ఆందోళనలకు గురవుతున్నారని, ప్రాణభయంతో మరో ప్రాంతానికి తరలి వెళ్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే బోటు ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిసింది. ఈ పడవ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు బృందం పని చేస్తోందని అధికారులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 08 , 2024 | 07:17 AM

Advertising
Advertising