ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రపంచ సంఘర్షణలతో పేద దేశాలు సతమతం

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:58 AM

ప్రపంచంలో నెలకొన్న సంఘర్షణల ప్రభావం పేద దేశాలపై పడుతోందని, అందువల్ల వీటికి వెంటనే పరిష్కారం కనుగొనాల్సి ఉందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

వెంటనే పరిష్కారం కనుగొనాలి.. జీ20 సదస్సులో మోదీ

రియో డి జనెరియో, నవంబరు 18: ప్రపంచంలో నెలకొన్న సంఘర్షణల ప్రభావం పేద దేశాలపై పడుతోందని, అందువల్ల వీటికి వెంటనే పరిష్కారం కనుగొనాల్సి ఉందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. యుద్ధాల ప్రభావం ఆహారం, ఇంధనం, ఎరువుల రంగంపై పడిందని చెప్పారు. ‘గ్లోబల్‌ సౌత్‌’గా వ్యవహరించే ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లోని పేద దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బ్రెజిల్‌ రాజధాని రియో డి జనెరియోలో జరిగిన జీ-20 కూటమి శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. యుద్ధాల కారణంగా గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు జరుగుతున్న నష్టంపై దృష్టి పెట్టాలని, అప్పుడే ఈ సదస్సు విజయవంతమవుతుందన్నారు. ‘సామాజిక సమ్మిళితం, ఆకలి, పేదరికాలపై పోరాటం’ అన్న అంశంపై కూడా దృష్టి పెట్టాలని చెప్పారు. ఆకలి, పేదరికానికి వ్యతిరేకంగా ప్రపంచ కూటమి ఏర్పాటు కావాలన్న బ్రెజిల్‌ అధ్యక్షుడి ప్రతిపాదనను స్వాగతించారు. సదస్సు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు లుల డి సిల్వా, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ అంటోనియో గుటెర్రస్‌, ఇతర ప్రపంచ నాయకులతో భేటీ అయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కరచాలనం చేశారు. బ్రెజిల్‌లో మోదీకి వేద మంత్రాలతో ఘనస్వాగతం లభించింది. సంప్రదాయ భారతీయ వస్త్రాలు ధరించిన పలువురు సంస్కృతశ్లోకాలు పఠిస్తూ స్వాగతం పలికారు.

Updated Date - Nov 19 , 2024 | 01:59 AM