ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mobile Phones: దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్స్ బ్యాన్.. రివర్స్‌లో ప్రధానిపై కౌంటర్స్

ABN, Publish Date - Feb 20 , 2024 | 04:02 PM

ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్‌(Mobile Phones)లకు ఎంతలా అలవాటు పడిపోయారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దలదాకా.. చేతిలో ఫోన్ లేనిదే క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా.. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులైతే మొబైల్ ఫోన్‌లను విపరీతంగా వాడేస్తున్నారు.

ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్‌(Mobile Phones)లకు ఎంతలా అలవాటు పడిపోయారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దలదాకా.. చేతిలో ఫోన్ లేనిదే క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా.. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులైతే మొబైల్ ఫోన్‌లను విపరీతంగా వాడేస్తున్నారు. వాటికి బానిసలుగా మారిపోతున్నారు. దీంతో వాళ్లు తమ చదువులపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఈ తరుణంలోనే.. విద్యార్థుల్లో మార్పు రావడం కోసం యూకే(United Kingdom) ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో మొబైల్ ఫోన్ వినియోగంపై నిషేధం విధించింది. ఈ సందర్భంగా.. పాఠశాలల్లో మొబైల్ ఫోన్లు ఎంత ప్రభావం చూపుతాయోనని వివరిస్తూ యూకే ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) ఒక వీడియోని పంచుకున్నారు.


‘‘సెకండరీ పాఠశాల విద్యార్థుల్లో దాదాపు మూడింట ఒక వంతు మంది.. ఫోన్‌ల వల్ల తమ పాఠాలకు అంతరాయం కలిగిందని చెప్పారు. తరగతి గదుల్లో ఫోన్స్ ఎంతో ప్రభావం చూపుతున్నాయన్న విషయం మాకు తెలుసు. ఇప్పటికే చాలా పాఠశాలలు ఫోన్స్‌పై నిషేధం విధించాయి. ఈ నిర్ణయం.. విద్యార్థులకు సురక్షితమైన, మెరుగైన అభ్యాస వాతావరణానికి దారితీసింది. ఈ క్రమంలోనే మేము కూడా కొత్త మార్గదర్శకాలను తీసుకొస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు ఫోన్‌లపై నిషేధం విధించాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలందరూ సరైన విద్యను పొందాలన్నదే మా ఉద్దేశం’’ అని రిషి సునాక్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తాను మాట్లాడుతున్నప్పుడు మధ్యమధ్యలో ఫోన్ రింగ్ అయితే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, పాఠశాలల్లోనూ అదే పరిస్థితి ఉంటుందని ఈ వీడియోలో అనుకరించి చూపించారు.

అయితే.. రిషి సునాక్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన షేర్ చేసిన వీడియో చెత్తగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ దీనిని అదునుగా తీసుకొని.. సునాక్‌పై ఒక పేరడీ వీడియోని విడుదల చేసింది. UKలోని ఆర్థిక మాంద్యం, NHS వెయిటింగ్ లిస్ట్‌లు, ఇమ్మిగ్రేషన్ సవాళ్ల గురించి ఆ పేరడీ వీడియోలో ప్రశ్నిస్తూ.. ముందుగా వీటిని పరిష్కరించమని కౌంటర్ ఇచ్చింది. ఏదేమైనా.. మొబైల్ ఫోన్ల కారణంగా విద్యపై శ్రద్ధ చూపని విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, దీంతో వారి ప్రవర్తనలోనూ మార్పు వస్తుందని యూకే విద్యా కార్యదర్శి గిలియన్ కీగన్(Gillian Keegan) చెప్పుకొచ్చారు.

Updated Date - Feb 20 , 2024 | 04:02 PM

Advertising
Advertising